ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ప్రపంచ పర్యావరణం సంక్షోభంతో భూమి పూర్తిగా వేడిగా మారుతోంది. దీంతో హిమానీ నదాలు కరిగి భూమి మొత్తం నీటితో నిండిపోనుందా.. అంటే అవుననే కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడి గ్లోబల్ వార్మింగ్ జరగకుండా వివిధ చర్యలు తీసుకోవాలని జీ-7, జీ 20 దేశాలు, ఇతర దేశాలు ఐక్యరాజ్య సమితి దేశాలు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పని చేయాలని నిర్ణయించుకున్నాయి.

బొగ్గు ఆధారిత విద్యుత్ తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. సోలార్ పవర్ ను వినియోగించాలని,  విండ్ పవర్ వాడుకోవాలని ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అణు విద్యుత్ ను కూడా వినియోగించాలని కూడా నిర్ణయించుకున్నాయి. కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ లక్ష్యాలు అన్ని దెబ్బతిన్నాయి.

అయితే యుద్దం కారణంగా యూరప్ దేశాల్లో తీవ్రమైన కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆయా దేశాలు తప్పని సరి పరిస్థితుల్లో మూసివేసిన థర్మల్ ప్లాంట్లను మళ్లీ తెరుస్తున్నాయి. అణు విద్యుత్ కర్మాగారాలను కూడా మూయాలని నిర్ణయం తీసుకున్న మళ్లీ తెరిచేందుకు యూరప్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిపై జీ-7 దేశాలు ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే జపాన్ ప్రధానమంత్రిపై హత్యయత్నం జరిగినా కూడా జీ -7 సదస్సును రద్దు చేసుకోకుండా పర్యావరణ పరిరక్షణ పై మీటింగ్ కొనసాగింది.

విండో పవర్, సోలార్ పవర్ ను ఎక్కువగా తయారు చేసుకుని పర్యావరణాన్ని రక్షించేందుకు అన్ని దేశాలు తోడ్పాటు అందించాలని కోరాయి. కానీ ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తామని చెప్పిన యూరప్ దేశాలు మళ్లీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు తెరవడం వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడనుంది. ఇప్పుడు గనక వాయు కాలుష్యాన్ని అరికట్టకపోతే హిమాలయాల్లో ఉన్న మంచు కొండలు, అంటార్కిటికా ఖండం మొత్తం కరిగి ప్రపంచం అంతా మునిగి పోయే ప్రమాదం పొంచి ఉందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: