పిల్లలు పుట్టలేదా.. ఇలా దత్తత తీసుకోండి?

ఇంట్లో పసిపాప బోసినవ్వులు ఎంతో సందడి చేస్తాయి. ఇంటికి పిల్లలే అందం అంటారు. అందుకే పేదా ధనవంతులనే తేడా లేకుండా అంతా సంతానం కోసం కలలు కంటారు. అయితే అందరికీ ఈ కల సాకారం కాదు. కొందరికి అనేక కారణాల వల్ల పిల్లలు పుట్టరు. అలాంటి వారికి ఉన్న మార్గాల్లో ఒకటి దత్తత.

తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ దేశంలోనే మొట్టమొదటిసారి "దత్తత హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేసింది.  హైదరాబాద్ మధురానగర్ లోని మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్  కార్యాలయంలో దత్తత హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. దీన్ని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు 040-23748663 , 040-23748664 నంబర్లలో సంప్రదించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

హెల్ప్‌డెస్క్‌కు వచ్చిన ఫోన్ కాల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా మాట్లాడి వివరాలు తెలిపారు. సంతానం కలగని దంపతుల కోరికను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సంతానం లేని తల్లిదండ్రులకు పిల్లలను దగ్గర చేయడం తల్లిదండ్రులు లేని చిన్నారులకు కుటుంబాన్ని దగ్గర చేయడం ఓ గొప్ప కార్యక్రమంగా మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా క్రమ పద్దతిలో పిల్లల దత్తత ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలో 2000లకు  పైగా తల్లిదండ్రులు పిల్లల కోసం దరఖాస్తులు చేసుకుని దత్తత తీసుకోవడానికి వేచి చూస్తున్నారని మంత్రి తెలిపారు. దత్తత ఇచ్చేందుకు ప్రస్తుతం 38మంది సాధారణ పిల్లలు ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వీరు కాకుండా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు 100మంది వరకు ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మరింకేం.. పిల్లలు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: