ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

తాజాగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రకాష్ కారత్ విజయవాడ వచ్చారు. కేంద్రాన్ని ప్రశ్నించాలని, తెలంగాణలా, తమిళనాడులా కేంద్రాన్ని ప్రశ్నించడం మీకు సాధ్యం కావడం లేదని, బిజెపిని గద్దె దించాలి అలాగే బిజెపికి అనుకూలంగా ఉండే, ఆంధ్రప్రదేశ్లో  వాళ్ళకి అనుకూలంగా ఉండే జగన్ ని కూడా గద్దించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లబోతున్నారు ఆయన.

సాధారణంగా గెలవాలనుకున్న ఏ పార్టీ అయినా సరే ప్రజల దగ్గరకు కు వెళ్లి, పక్క పార్టీ వాళ్ళు చేసిన తప్పలను గురించి మాట్లాడి, తాము నెగ్గితే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి తమను గెలిపించమని కోరుకుంటారు కానీ. వీళ్లు మాత్రం తమను గెలిపించమని అడగడం అనే విషయాన్ని పక్కన పెట్టి, ముందు పక్క పార్టీ వారిని ఓడించండి, గద్దె దించేయండి అని కోరుకుంటారు. అంటే తమ గెలుపు కన్నా పక్కవారి ఓటమి ముఖ్యం వీళ్ళకి అని తెలుస్తుంది. ఇలాంటి భావాలు ఉండటం ప్రపంచంలోని ఎక్కడా చూడం వీళ్ళ ఒక్కళ్ళ దగ్గర తప్ప.

ఇంకో విషయం ఏంటంటే కమ్యూనిస్టులకి ముందు నుంచి బిజెపిని తొక్కేయాలని ఆలోచనే తప్ప మరొకటి ఉండదని తెలుస్తుంది. వీరికి హిందుత్వం  అనేది నచ్చదు. ఏ మతాన్ని పట్టించుకోకపోతే పర్వాలేదు. కానీ వీళ్ళు ఒక హిందువులను తప్ప ముస్లింలను క్రిస్టియన్స్ ను బాగానే ఆదరిస్తారు. హిందువులను మతోన్మాదులుగా చూపిస్తారు. ప్రపంచ చరిత్ర చూసుకుంటే ఏ ముస్లిం దేశం మీదకో, క్రిస్టియన్ దేశం మీదకో దండయాత్రకు వెళ్లి వాళ్లను మతం మారమని, బలవంతంగా మతం మారమని వేధించిన చరిత్ర మన భారతీయులకు లేదు.

ఇప్పుడు వరకు డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ముస్లిం దేశస్తులు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి, మన ఆలయాలను ధ్వంసం చేసి మన ప్రజలను వారి మతంలోకి మారమని హింసించిన చరిత్రలు అయితే చాలానే ఉన్నాయి. అయినా సరే హిందువులని ఒక్కరినే మతోన్మాదులుగా చూపిస్తారు వీళ్ళు ఎందుకో.

మరింత సమాచారం తెలుసుకోండి:

CPM

సంబంధిత వార్తలు: