కవితను వెంటాడుతున్న సుఖేష్‌?

ఒకేసారి రెండు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలకు సంబంధించిన నేతల మీద కీలకమైన కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు అయితే అక్కడ ఈడి సిబిఐ చూసుకుంటూ ఉంటే, ఇక్కడ సిబిఐ డీల్ చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు. అయితే ఇక్కడ వార్తలను హైలెట్ చేస్తూ ఉంటే, అక్కడ వార్తలను మాత్రం భయంతో వణికి డౌన్ ప్లే చేస్తున్నటువంటి సందర్భమని తెలుస్తుంది.

కేజ్రీవాల్ తరపున హవాలా వ్యాపారి డబ్బులు కలెక్షన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఈ రెండు పనులు చేసి జైల్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారి సుకేష్ చంద్రశేఖరన్  73 పేజీల చాట్ తన దగ్గర  ఉన్నాయని ఇంతకుముందు ప్రకటించాడు. ఆయన మరోసారి సంచలనాత్మకమైన మాటలే చెప్పాడు. ఆయన కవిత వెల్కమ్ టు బీహార్ క్లబ్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే కవిత కూడా జైలుకి వస్తుందంటూ తీవ్రమైన కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు ఆయన.  కేజ్రీవాల్ తర్వాత ఆమె కూడా ఇక్కడికి రాక తప్పదు అనేది సుఖేష్ చంద్రశేఖరన్ అభిప్రాయం అని తెలుస్తుంది.

పర్టిక్యులర్ గా ఈడి ప్రశ్నలు అయితే అయిపోయాయి. సిబిఐ ప్రశ్నిస్తుంది ఇప్పుడు. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు సిబిఐ తనని అటు పిలుస్తుంది. అయితే ఈడి కవిత విషయంలో ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఈమె చెప్పినటువంటి వివరణ కొన్ని సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఇచ్చిన నేపద్యంలో వాటన్నింటినీ సాంకేతిక పరీక్షల తర్వాత దాంట్లో ఉన్నటువంటి విషయం రైటో రాంగో నిర్ణయించుకుంటారని చెబుతున్నారు.

కానీ ఈ లోగా సుఖేష్ చంద్రశేఖరన్ ఇచ్చే స్టేట్మెంట్స్ అయితే కవితను వెంటాడుతున్నాయి. తాజాగా సుకేష్ చంద్రశేఖరన్ ఫోన్ నెంబర్స్ లిస్టు రిలీజ్ చేశాడు. కవిత నెంబర్స్ ఇవి అంటూ వాటిని రిలీజ్ చేశాడు. ఈ స్టేట్మెంట్స్ ద్వారా జైలుకు రాక తప్పదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఒక సంచలనం అయింది. అయితే సుఖేష్ చంద్రశేఖరన్ వీటిని ఎలా రిలీజ్ చేస్తున్నాడంటే, తన లాయర్ ద్వారా వీటిని రిలీజ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: