ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచింది ఎవరనేది ఇంకా తేలలేదు. కానీ మధ్యలో అమెరికాకి సంబంధించిన ఆయిల్ కంపెనీలు మాత్రం గెలిచాయని, అది కూడా హై రేంజ్ లో గెలిచాయని అనలిస్టులు చెప్తున్నారు. ప్రపంచ స్థాయిలోనే లేనటువంటి విధంగా వారు సంపాదించారని చెప్తున్నారు. ఇక్కడ రష్యా దగ్గర నుంచి అమెరికన్ కంపెనీలు కొంటున్నాయి గానీ, అమెరికా ప్రభుత్వం కొనడం లేదు.

అలాగే యూరప్ కొనడం లేదు, యూరప్ దేశంలోని కొన్ని కంపెనీలు కొంటున్నాయని తెలుస్తుంది. ఆయా దేశాల్లోని ఆయిల్ కంపెనీలు రష్యా నుండి కొనకూడదని నిషేధం ఏమీ లేదు. ఆయా ప్రభుత్వాలు కొనమంటున్నాయ్ అంతే. వీళ్ళు కొని ఆయా ప్రభుత్వానికి అమ్మడంతో దీని ద్వారా సంపాదించిన సంపద ప్రపంచంలోనే ఎప్పుడూ లేనివిధంగా ఉందని ఈ మధ్యన బైడెన్ కూడా పరోక్షంగా అంగీకరించారు.

200బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయట అమెరికన్ కంపెనీలకి. అంటే 25, 30 ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి సంపద అన్నమాట అది. ఆంక్షలలోనే ఆయిల్ ని  హకొన్నారట వారు. నవంబర్2022 నుండి ఈ సంపాదన మొదలైంది అంట. అక్సన్ మొబైల్ సీఈవో దారెన్ కి ఈ మధ్యన 52%జీతం పెంచారట.

ఏడాదికి ఇప్పుడు ఆయన జీతం 300కోట్లు ఆట. ఎందుకు ఇంత పెంచారంటే విజయవంతంగా ఆయిల్ ని కొనడం, అమ్మడం చేసినందుకట. 2021 లో 56బిలియన్ డాలర్ల లాభం సాధించిన అక్సన్ మొబైల్ ఇప్పుడు ఏకంగా 200బిలియన్ డాలర్ల లాభం సంపాదించిందట. అది కూడా ఆ ఒక్క కంపెనీనే అంత సంపాదించిందట. 160%కొత్తగా లాభాలు పెరిగేయట వాళ్ళకి. అదే కాకుండా షబ్రాన్ కంపెనీ 36.5 బిలియన్ డాలర్లు, 115సంవత్సరాలు చరిత్ర ఉన్న షెల్ కంపెనీ 39.9బిలియన్ డాలర్లు, బ్రిటన్ కు సంబంధించిన బిపి సంస్థ 27.7బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించిందట. అంటే ఒక పక్కన అస్థిరత నుండి కూడా లాభాన్ని సంపాదించారు వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: