అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

రైతుల సొమ్ము బ్రోకర్ల పాలవుతోంది. అనంతపురం మార్కెట్ యార్డుకు బత్తాయి, నారింజలను అమ్మడానికి తీసుకొచ్చిన ఓ రైతు ఆవేదనతో ఒక లెటర్ ప్రభుత్వానికి రాశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించిన వారు మార్కెట్ యార్డుల్లో  దళారుల వ్యవస్థల్ని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు చట్టాల ద్వారా రైతు తనకు ఇష్టమొచ్చిన రేటుకు దేశంలో ఎక్కడైనా సరకు అమ్ముకునే వెసులు బాటు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ యార్డుకు తెస్తే ఒకరో ఇద్దరు బ్రోకర్లు నిర్ణయించిన రేటుకు రైతు తాను పండించిన పంటను అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయాడు.

తాను తెచ్చిన కాయలకు ఉదయం ఒక దళారి ధర నిర్ణయించారు. కేజీ 26 రూపాయలు ఇస్తామని చెప్పాడు. పాట పాడేందుకు రెండో వ్యక్తి కూడా లేదు. కనీసం ఎంతో కొంత రేటు పెరుగుతుందని అనుకుంటే అదీ లేదు. మొత్తం చీని కాయలను ఈ మండీల్లో ఇద్దరు మాత్రమే కొనుగోలు చేస్తారు. మిగతా ఎవరూ ముందుకు రారు. బయట పది నుంచి ఇరవై లారీలు రెడీగా ఉన్నాయి.

కేజీ రూ. 26 ఇచ్చి కాయల్ని కొనేసుకున్నాడు. రెండు రోజుల్లో డబ్బులు అకౌంట్ లో పడతాయన్నారు. వేలం అంటే పోటీ ఉండాలి. కానీ  ఎలాంటి పోటీ కనిపించలేదు. కనీసం మార్కెట్ స్థాయి అధికారి గానీ, జిల్లా స్థాయి అధికారి గానీ ఎవరూ పర్యవేక్షించలేదు.  మొత్తం కాయలు 5815 కిలోలు, ఇందులో 116 కిలోలు తీసేశారు. దీంతో 5669 కిలోలుగా మారిపోయింది. దీంతో 1,48,174 రూపాయాలు వచ్చింది.

పొడికాయలకు రూ. 1500 వచ్చింది.  ఇందులో కమిషన్ రూ.5977, బాడుగ  రూ. 8971,  దించిన కూలీ 750 రూపాయలు, గేట్ ఛార్జీ 150, కాగా మొత్తం 15,254 అయింది. ఎలాంటి కష్టం లేకుండా దళారి 15 వేలు రైతు నుంచి సంపాదిస్తుంటే కష్టపడ్డ రైతుకు ఏం ఆదాయం వస్తుందని కృష్ణమూర్తి అనే రైతు వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: