తెలంగాణపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ టీమ్‌?

రాహుల్ గాంధీ దక్షిణాదిపై చాలా సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. ఇందిరా గాంధీ హాయాంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో  కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిపెట్టిన ప్రాంతం దక్షిణ భారత దేశం. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దక్షిణాదిలోనే గెలుచుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి రాహుల్ గాంధీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలాగైన అధికారంలోకి తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు ఒక టీంను పంపారు.

లోకల్ కాంగ్రెస్ నాయకులు కొన్ని నివేదికలు అనుకూలంగా మరి కొన్ని వ్యతిరేకంగా ఇస్తున్న తరుణంలో డైరెక్టుగా రాహుల్ గాంధీ టీం ను పంపి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఉత్తర భారత దేశంలో ఎమర్జెన్సీ టైం, మిగతా కీలక సమయాల్లో కూడా కాంగ్రెస్ కు పెద్దగా సీట్లు రాకున్న అప్పటి పరిస్థితుల్లో ఎక్కువ ఎంపీ స్థానాలతో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టింది దక్షిణాది ప్రాంతం.

అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పార్టీ లు మారే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు లు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.  వీరు ఈ మధ్య సొంతంగా పార్టీ పెడతారని, లేదా ఏదైనా జాతీయ పార్టీలో చేరతారని వార్తలు బయటకు వచ్చాయి. బీజేపీలో చేరతారని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికీ దీనిపై  ఒక స్పష్టత లేదు.

ఇలాంటి సమయంలో ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీలో  చేర్చుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పొంగులేటితో ఆరు గంటల పాటు రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ రాహుల్ టీంతో చర్చలు సఫలమైతే పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: