చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

మొన్న టిడ్కోఇళ్ల దగ్గరికి వెళ్లి సెల్ఫీ చాలెంజ్ అని నినాదం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జగన్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై ఆయన ప్రతిస్పందించారు. మేము కట్టిన ఇళ్ల దగ్గరికి మీరు వెళ్లి సెల్ఫీలు దిగడం ఏంటి ముసలాయన అని కాస్త వ్యంగ్యంగానే మాట్లాడారు జగన్.  ఆయన మాట్లాడుతూ చేతనైతే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంటికి నువ్వేం చేసావు, మేమేం చేసామనేది కనుక్కుని, మా వల్ల ఎక్కువ పని జరిగిందా మీ వల్ల ఎక్కువ పని జరిగిందా అనేది సెల్ఫీ తీసుకో అని సవాల్ విసిరారు. ముసలాయన అనే పదం ఆయన ఇక్కడ పదే పదే వాడటం కీలక పరిణామం. ఆయన కావాలని ఆ పదం వాడుతున్నట్టుగా తెలుస్తుంది.

జగన్ ఈ సవాల్ విసిరి కొత్తగా ఏదో ఎత్తుగడ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి సంతకం తోనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల రుణ మాఫీ విషయం ఏమో గాని, అప్పుడు వరకు ఇచ్చే సున్నా వడ్డీ పథకం కూడా తీసేసారని ఆయన అన్నారు. ఇంత పాపం చేసిన చంద్రబాబు నాయుడుని, మా ఇంటి ముందుకి వచ్చి సెల్ఫీలు దిగే నైతికత కానీ, మా ఇంటికి  స్టిక్కర్లు అంటించే అర్హత గానీ నీకు ఉందా బాబు అని గట్టిగా అడగండి అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ముసలాయన మాట్లాడడనీ, నాలుగు ఫేక్ ఫోటోలు అయితే దిగుతాడనీ, కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్లి, మీ బిడ్డల హయాంలో వేగంగా పనులు జరుగుతున్న టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్లి సెల్ఫీ పేరుతో నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు ఈ 75సంవత్సరాల ముసలాయన. పైగా తాను ఫోటోలు దిగడమే కాకుండా, సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. సెల్ఫీ అంటే ప్రజల సంతృప్తితో కూడిన సంతోషమని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: