ప్రపంచానికి గుడ్‌న్యూస్‌.. ఆ యుద్ధం ఆగుతోంది?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు కొనసాగుతోంది. ఇజ్రాయిల్ దేశం అల్ అక్సా మసీదుకు సంబంధించి జరుగుతున్న యుద్దం కారణంగా సిరియా, లెబనాన్ పై యుద్దం ప్రారంభమైంది. సిరియా, లెబనాన్ ఒక వైపు నుంచి యుద్దం కొనసాగిస్తుంటే ఇజ్రాయిల్ ఎయిర్ మిస్సైల్స్ తో ఆ దేశాలపై విరుచుకుపడుతోంది. ఓ పక్క చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే లా ఉంది. తైవాన్ కు అండగా అమెరికా ఉంటోంది. నాలుగో వైపు ఇరాన్, సౌదీ అరేబియా ల మధ్య చాలా ఏళ్లుగా తీవ్రమైన గొడవలే నడుస్తున్నాయి. ఇరాన్ మద్దతుదారులు సౌదీ, దుబాయ్ లాంటి దేశాల పై గతంలో దాడులు కూడా చేశారు. సౌదీతో విభేదాల కారణంగా యెమెన్లో 9 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. యెమెన్ లో ఇప్పటికీ రష్యా ఇస్తున్న గోధుమపిండిని తిని బతుకుతున్నారు. 80 శాతం మంది మానవతా సాయంతో నే జీవిస్తున్నారు. 14 శాతం మంది పిల్లలు రోడ్లమీదే పడుకుంటున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా కొంత దాడులు తగ్గినా.. కొన్ని చోట్ల నిత్యం ఘర్షణ వాతావరణం కొనసాగేది. కానీ 7 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా, ఇరాన్ ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. దీని వల్ల సౌదీ, యెమెన్, హైథీ ఇరాన్ లాంటి దేశాల మధ్య జరుగుతున్న ఏళ్ల తరబడి యుద్దం నిలిచిపోనుంది. ఇలా ఈ యుద్ధం ఆగిపోతే యెమెన్ లో ఇప్పటికీ చదువుకోలేని, చదువురాని చాలా మంది పిల్లలకు ఎంతో ఉపయోగం కానుంది.

ఈ శాంతి చర్చల వల్ల యెమెన్, సౌదీలో ఇప్పటివరకు నిత్యం వినిపించే బాంబు దాడులు ఇక ఆగిపోతాయి. ఒక యద్దం ఆగిపోతే ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయి. ఎందరో బాగు పడతారు. చదువుకోవచ్చు. మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఆయా దేశాల అభివృద్ధికి తోడ్పాటును అందించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: