జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దేశంలో రిచెస్ట్ సీఎం. ప్రస్తుతం జగన్ కూడా రిచెస్ట్ సీఎంగా నే ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల తరఫున ఉన్న సమయంలో కూడా వీరే ప్రథమ స్థానంలో ఉండటం ఇక్కడ గమనార్హం.  ఏడీఆర్ రిపోర్టు ప్రస్తుతం ఆస్తుల వివరాలను బయటపెట్టింది. భారతదేశంలో రిచెస్ట్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అని తేలింది. ఇది అఫిడవిట్ లో పేర్కొన్న సమాచారం ఆధారంగా ఏడీఆర్ బయటపెట్టిన అంశం.

30 మంది ముఖ్యమంత్రుల్లో జగన్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తేలింది. లక్ష కోట్ల రూపాయాల అవినీతి జగన్ చేశారని ఎన్నో ఆరోపణలు టీడీపీ, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు జగన్ ను టార్గెట్ చేసి ఆయన్ని జైలు వరకు తీసుకెళ్లేలా చేశాయి. కానీ లక్ష కోట్లు కాదు. గతంలో సీబీఐ చేసిన దర్యాప్తులో 1100 కోట్లు, లేదా 1200 కోట్ల పెట్టుబడుల గురించి మాత్రమే ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం లక్ష కోట్లు అని ప్రచారాన్ని చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం మాత్రం జగన్ అఫిడవిట్ లో పేర్కొన్న మొత్తం తన ఆస్తి కేవలం 500 కోట్ల రూపాయలే అని తెలుస్తోంది. ఎలా ఉంటుందంటే రూ. 500 కోట్ల రూపాాయాలపై గతంలో కడప లో 20 ఇళ్ల కిందట  ఒక ఇల్లు లక్ష రూపాయాలకురూ. 20 వేలకు కొని ఉంటే దాని విలువ ప్రస్తుతం అఫిడవిట్ లో దాదాపు రూ.2 లక్షలుగా చూపిస్తారు.

కానీ మార్కెట్ లో దాని అసలు విలువ దాదాపు రూ. రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు పలుకుతుంది.అంటే పాత లెక్కల ప్రకారం రేటును తగ్గించి చూపించడం ద్వారా అఫిడవిట్ లో ఆస్తుల విలువ తక్కువగా కనిపిస్తుంది. మరి సీఎం జగన్ ఒక్కరి ఆస్తి విలువ కాదు. అందరి రాజకీయ నాయకులు అఫిడవిట్లో చూపించేది ఇలాంటి ఉదాహరణలతోనే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: