అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్‌?

పాకిస్థాన్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. ఐఎంఎఫ్ దానికి అప్పులు ఇచ్చినా కూడా అది ఆయా దేశాలకు పూర్తిగా తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. దాదాపు 63 వేల కోట్ల అప్పు కట్టాల్సి ఉంది. అది కేవలం రెండు దేశాలకు మాత్రమేనని తెలుస్తోంది. చైనా, సౌదీ అరేబియా రెండు దేశాలకు ఈ అప్పు తీర్చాల్సి ఉంది.

ఈ ఏడాది 35 వేల కోట్లు, వచ్చే ఏడాది 35 వేల కోట్లు మిగతాది మొత్తం మూడో సంవత్సరం చెల్లిస్తే లక్ష కోట్ల వరకు అప్పు తీర్చాల్సింది ఉంది. ఆదాయం మాత్రం జిరోలో ఉంది. కరెంట్ లేకుండా ఉంటోంది. పరిశ్రమలు నడవడం లేదు. ఆయిల్ సంక్షోభం కొనసాగుతోంది. ఇన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఆదాయ వనరులు లేవు. ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదు. దీనికి తోడు అప్పులు తీర్చాలని వివిధ దేశాలు పట్టుబడుతున్నాయి.

పోనీ కొత్త అప్పులు తేద్దాం అనుకుంటే ఏ దేశమూ ఇచ్చేలా లేదు. ఇన్ని కష్టాల నడుమ పాకిస్థాన్ పరిస్థితి ఆర్థిక పరంగా దయనీయంగా తయారైంది. రాబోయే రోజుల్లో శ్రీలంక తరహా పరిస్థితికి వచ్చేలా ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రాబడి పెంచి ఆదాయాన్ని అనుసరించే మార్గాల కోసం వెతుక్కుంటోంది. అయినా ఇప్పట్లో అన్ని అప్పులు తీర్చే వనరులు ఎక్కడ కనిపించడం లేదు. సోమాలియా లాగా పాకిస్థాన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వరి, గోధుమ లాంటి ఉత్పత్తులు పండే ఈ దేశంలో గోధుమ పిండి కూడా దొరకలేని పరిస్థితి ఉంది. గోధుమ పిండి కోసం పోయి 13 మంది తొక్కిసలాటలో మరణించిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాక్ ప్రధాని ఈ గండం నుంచి గట్టెక్కించాలంటే చేయాల్సన పని ఏమిటి? ఏ దేశాలు పాకిస్థాన్ కు సహకరించే అవకాశం ఉంది. ఎవరిని ప్రాధేయపడితే పని అవుతుందనే ఆలోచనతో ముందుకెళ్లాలి. రాబోయే రోజుల్లో పాక్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: