ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఎటాక్ జరిగింది. అయితే ఈ కేసు విషయంలో కోర్టు బాధితుడిగా ఉన్న జగన్ వాంగూల్మం కావాలని కోరింది. ఇందులో జగన్ బాధితుడు కాగా, శ్రీను అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. అయితే గతంలో వివిధ కేసుల్లో ప్రతి శుక్రవారం న్యాయస్థానాలకు జగన్ హాజరయ్యే వారు.

కానీ సీఎంగా పదవి చేపట్టాక కోర్టుల కూడాా వెళ్లకుండా వాంగూల్మాన్ని తన న్యాయవాది ద్వారా పంపండం చేస్తున్నారు. సీఎం గా బీజీ ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాకుండా ప్రత్యేక అనుమతి తీసుకుంటున్నారు. అయితే గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా జగన్ ప్రత్యక్షంగా హాజరై తన వాంగూల్మం ఇచ్చే వారు.
అయితే జగన్ పై దాడి కేసులో ఆయన బాధితుడు కాబట్టి ఆయన వాంగూల్మం తీసుకోవాలని కోర్టు కోరింది. కానీ రాలేనని చెప్పి వాంగూల్మం న్యాయవాది ద్వారా పంపిస్తున్నారు. విజయవాడ కోర్టకు సీఎం ఉండే తాడేపల్లి ఆఫీసుకు పెద్ద దూరం కూడా ఉండదు. అయినా సీఎం జగన్ అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. వివిధ కేసుల్లో న్యాయస్థానాల వద్ద సీబీఐ కోర్టు వద్ద హాజరైన జగన్ ప్రస్తుతం కోర్టుకు వెళ్లేందుకు అయిష్టత కనబరుస్తున్నారు.


అయితే కోర్టులు బాధితుడు ముఖ్యమంత్రి అయినా వ్యక్తిగానే చూస్తుంది. న్యాయస్థానాలకు అందరూ సమానమే అన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మరిచిపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే కోర్టకు రామని చెప్పే సమయంలో అత్యవసర సమయంలో మాత్రమ రాలేమని న్యాయస్థానాలకు చెబుతారు. కానీ సీఎం పదవిలో ఉండి కోర్టుకు హాజరయితే కూడా ఆయనపై పాజిటివిటీ పెరుగుతుంది. కానీ సీఎం జగన్ కేవలం బాధితుడిగా ఉన్న కేసులో కూడా వాంగూల్మం ఇవ్వకపోవడం అనేది ఎందుకో తెలియడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి పిలిస్తే వెళతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: