శివాజీ ఖడ్గం.. మోదీ బ్రిటన్‌ నుంచి తెప్పించగలరా?

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేసింది లేదు. చివరికి ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న, యుద్ధం చేయలేని నిస్సహాయులకు, స్త్రీలకు, పసివారికి కూడా శివాజీ సహాయం చేసాడు. ఆయన పరాక్రమం మహారాష్ట్రలో జనాలకి జై భవాని, వీర శివాజీ అనే ఉత్తేజపరిచే నినాదం అయ్యింది.

వేలాది మందితో యుద్ధానికి వచ్చిన శత్రు సైన్యం మీదికి కేవలం 50 నుండి 100 మంది సైన్యంతో వెళ్లి విజయం సాధించి వచ్చిన గొప్ప వ్యూహకర్త చత్రపతి శివాజీ. భారత దేశాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళని తరిమి కొట్టి, హిందువులని ఏకం చేసిన వీరుడిగా శివాజీని భావిస్తారు, కొలుస్తారు అనేకమంది. ఆ చత్రపతి శివాజీ నినాదం జై భవాని. అందుకే అక్కడ జై భవాని, వీర శివాజీ అని నినదిస్తూ ఉంటారు.

అయితే చత్రపతి శివాజీ యొక్క వీర ఖడ్గం ఇప్పుడు బ్రిటన్ లో ఉంది. ఆ ఖడ్గం పేరు జగదాంబ. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం వచ్చాక ఆ ఖడ్గాన్ని వెనక్కి తెస్తానంది బ్రిటన్ నుండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ వెనక్కి ఇవ్వమని అడుగుతుంది. భారత ప్రభుత్వం యునైటెడ్ కింగ్‌డమ్ మ్యూజియం నుండి శివాజీ ఉత్సవ ఖడ్గాన్ని తిరిగి తీసుకువస్తుంది.

ఛత్రపతి శివాజీ, ఆయనకు మూడు కత్తులున్నాయి. ఆ కత్తులకు తుల్జా, భవాని, జగదాంబ అని మూడు కత్తులకు మూడు పేర్లు పెట్టుకున్నారు. దాని వెనుక్కు తీసుకురావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అడిగితే బ్రిటన్ ప్రభుత్వం కూడా ఒక బృందాన్ని పంపించింది. భారత ప్రభుత్వం తరపున కూడా ఆ ఖడ్గాన్ని అడిగిన సందర్భంలో బ్రిటన్ ప్రభుత్వం లో రిషి సనక్  ప్రధానమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ ఖడ్గాన్ని ఇమ్మని అడుగుతున్నారు. ఆ ఖడ్గం మన దేశానికి వస్తే బ్రిటన్ కు తరలి వెళ్లిన భారతీయ ఖడ్గం తిరిగి వెనక్కి వచ్చినట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: