ఒక్క మెస్సేజ్‌తో పరిష్కారం.. జగన్‌ కొత్త ప్లాన్‌?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు సరికొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతోంది. ఇకపై మీకు కావాల్సిన మీ సమాచారం మొత్తం ఒక్క హయ్ అనే మెసేజ్ తో తెలిసిపోనుంది. ఎలా అనుకుంటున్నారా.. మీ వాట్సాప్ నెంబర్ నుంచి సచివాలయ నెంబర్ కు ఒక్క హాయ్ పెడితే చాలు. మీకు నవరత్నాల ప్రోగ్రాం అందుతుందా.. మీకు ఏ సర్టిఫికెట్ కావాల్సిన అవసరం ఉంది. మీరు అప్లై చేసి ఉంటే ఎన్నిరోజులకు వస్తుంది. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చి ఆగింది. ఏదైనా పథకంలో లబ్ధిదారులు కావాలనుకుంటున్నారా.. అయితే అర్హతలు ఏంటి? వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఏ విధమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఇలా అన్ని సచివాలయ వాట్సాప్ నుంచి ప్రజలకు నేరుగా తమ ఫోన్లలోకి వస్తాయి.

కేవలం వాట్సాప్ నుంచి ఒక్క హయ్ పెడితే సమాచారం ఇక మీ సొంతమవుతుంది. అయితే ఇంతవరకు ఇలాంటి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినట్లు లేదు. ప్రభుత్వం నుంచి ప్రతి విషయాన్ని నేరుగా వాట్సాప్ లోనే తెలుసుకోవడం ద్వారా ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి సేవలను ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్నాయి. కొన్ని సెల్ ఫోన్ సంస్థలు కూడా ప్రజలకు ఏం కావాలో ఎలా కావాలో వారి అభిరుచులను బట్టి ఆయా సేవలను దరికి చేరుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మొబైల్ రంగం, కార్పొరేట్, బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి సదరు కస్టమర్ కు ప్రతి సేవను సులభతరం చేసేశాయి.

జగన్ సర్కారు తీసుకురానున్న ఈ కొత్త టెక్నాలజీ తో చాలా వరకు అనుమానాలు తేటతెల్లం అయిపోతాయి. ఏ ఫైల్ గురించి అధికారి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిదీ వాట్సాప్ లో చూసుకోవచ్చు. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీని అందరికీ అందేలా చేస్తున్న జగన్ సర్కారు తీరును ప్రజలు, ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: