నాటో వార్‌ ప్లాన్‌ లీక్.. ఉక్రెయిన్‌ పనేనా?

యుద్ధ రహస్యాలు అనేవి  అత్యంత గోప్యంగానే ఉంటాయి. ఆ రహస్యాలకు సంబంధించిన పత్రాలు కూడా మాక్సిమం ఎవరికి అందుబాటులో ఉండవు. కానీ అలాంటిది ఏకంగా యుద్ధ రహస్య పత్రాలనేవి డైరెక్ట్ గా సోషల్ మీడియాలోకి రావడం అంటే ఇదేదో కావాలని ఎవరో చేసిన పనిలాగే అనిపిస్తుంది. దశల వారిగా ఇలా దెబ్బతీయాలని ఇటువంటి విషయాన్ని ఒక వ్యూహాత్మకమైన పత్రం, వార్ స్ట్రాటజీ ప్లాన్ అంటారు.

దీన్ని ఉక్రెయిన్ కి పంపించింది అమెరికా. నాటో, అమెరికా ఇంకా యూరప్ దేశాలు ఏ విధంగా సహాయ పడతాయి, రష్యాను ఏ దశల వారీగా దెబ్బతీయాలి అన్నటువంటి వ్యూహాత్మకమైన పత్రం ఇది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అది మాది కాదు అని తేల్చేద్దాం అన్నా అందులో ఉన్న మ్యాటర్ వే ఆఫ్ ప్లానింగ్ చూస్తే వీళ్ళే అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు అమెరికాకి ఉక్రెయిన్ పైన సందేహం వస్తుంది.

ఉక్రెయిన్ సైన్యంలో చీలిక ఏమైనా వచ్చి, రష్యాకు అనుకూలంగా ఉండడం కోసం వీళ్ళు ఎవరైనా చేశారా లేదంటే దీర్ఘకాలిక యుద్ధం చేయమని చెప్పేసరికి దానికి చిరాకు వచ్చిన ఉక్రెయిన్ ఈ పని చేసిందా అనేటువంటి సందేహం వస్తుంది దానికి. అయితే తాజాగా ఈ రహస్య యుద్ధ పత్రాల లీక్‌ విషయం పై పెంటగాన్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఉక్రేనియన్ సైన్యం కోసం రహస్య అమెరికన్ మరియు నాటో ప్రణాళికలను వివరించేటువంటి సున్నితమైన పత్రాలను సోషల్ మీడియా ఛానెల్‌లలో పోస్ట్ చేసినట్లు నివేదించబడింది. ఈ రహస్య పత్రం లీక్‌ వెనుక ఎవరున్నారనే దానిపై పెంటగాన్‌ దర్యాప్తు చేస్తోంది.

దీన్ని ఎవరో, రష్యా వాళ్ళు ఎవరో తయారు చేశారు అన్నమాట అబద్ధం. ఎందుకంటే అది స్వయంగా వాళ్ళ తయారు చేసినటువంటి డాక్యుమెంటే . అందుకే దానికి బాధ్యత ఎవరు, ఎక్కడి నుంచి లీక్ అయ్యింది అనే దాని మీద  దర్యాప్తు  మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: