రామోజీరావుపై అభియోగాలు.. నిజమెంత?

సొంత సంస్థలు ఉంటే తమ సొంత విషయాలను కూడా, సొంత సమస్యలను కూడా ప్రజాస్వామ్య సమస్యలుగా చూపించేసుకునే అవకాశం ఉంటుంది. ఆ వెసులుబాటు వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ల కష్టాన్ని హైలెట్ చేయడానికి మరొకరి హెల్ప్ కూడా వాళ్ళకి అవసరం ఉండదు ఆ రకంగా. మార్గదర్శికి కష్టం వస్తే మొత్తం చిట్ ఫండ్స్ కి కష్టం వచ్చినట్టే, ఈనాడు కి కష్టం వస్తే మొత్తం పత్రికా రంగానికి కష్టం వచ్చినట్టే, రామోజీరావు కి కష్టం వస్తే మొత్తం ప్రజాస్వామ్యానికి కష్టం వచ్చినట్టే, వాళ్ల పత్రికలోని వార్త ఇలాగే ఉంది.

చిట్స్ ఫండ్ సంఘమని తాజాగా కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యల వల్ల చిట్స్ ఫండ్ సంస్థ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుందని ఆ నివేదికలోని సమాచారం. అంటే వీళ్లు జనం సొమ్ముని ఏమైనా దోచేసుకుంటున్నారా, చిట్ ఫండ్ సంస్ధలన్నీ అలాంటివే అనుకుని రేపటి నుంచి జనాలు చిట్స్ వెయ్యొద్దా, లేదా ఉన్నవి ఇచ్చేయమని వాళ్ళ కార్యాలయాలు ముందు ధర్నా చేయాలా, లేకపోతే కేసులు పెట్టాలా?

ఎందుకు అవన్నీ లేకుండానే మార్గదర్శి పై కేసులు పెడుతున్నారు అంటే వీళ్లు కూడా ఆ డబ్బులు తీసుకుని వేరే దాంట్లో పెట్టుబడులు పెడుతున్నారా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారా లేదంటే ఆస్తులు ఏమైనా సమకూర్చుకుంటున్నారా. లేదా వేరే వ్యవస్థలకి దారి మళ్లించుకుంటున్నారా?

రామోజీరావు గారికి సంబంధించిన దాంట్లో గతంలో మార్గదర్శి ఫైనాన్స్ పెట్టారు డిపాజిట్లు వసూలు చేయడానికి. ఇప్పుడు మార్గదర్శి చిట్స్ డిపాజిట్లు కిందకి ఆ జనం సొమ్ముల్ని డిపాజిట్లు  చేసుకుని ఇతర రంగాల్లో పెట్టుబడులకు మళ్లించారని సీఐడీ ఆరోపిస్తోంది. మరి వీళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారా.. అలా చేస్తే, దారి మళ్ళిస్తే నేరమవుతుందని చట్టం చెబుతోంది. రామోజీరావు గారి సమస్యను వాళ్ళ నెత్తిమీద ఎందుకు వేసుకున్నట్టు లేదా ఈ సంఘాన్ని నడిపించే వాళ్లే రామోజీ రావు గారేనా అన్నదీ చూడాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: