ఇండోనేషియా: భూతవైద్యం నేర్పుతానని తాతల్లో కలిపేశాడు?

ఇండోనేషియాలో బ్లాక్ మ్యాజిక్ గోల నడుస్తోంది. అచ్చం అది యండమూరి వీరేంద్రనాథ్ నవల తులసి గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనే పేరుతో స్లమిక్ తోహెరీ అనే వ్యక్తిని ఇండోనేషియాలో అరెస్టు చేశారు. ఇతను చేసిన నేరం 12 మందికి బ్లాక్ మ్యాజిక్ నేర్పిస్తానని నమ్మించి కాపీలో విషం ఇచ్చి చంపేశాడు. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటనుకుంటున్నారా భూత, ప్రేత, పిశాచ విద్యలు నేర్పడం, మీకున్న సంపదను మూడు రేట్లు చేస్తానని నమ్మించడం.

సంపద మూడు రేట్లు పెరుగుతుంది కదా అని డబ్బులిచ్చి విద్య నేర్చుకునేందుకు ప్రయత్నించడం. ఎంతకీ సంపద పెరగదు. భూత విద్య రాదు. దీంతో విసుగు చెందిన  వారు అతడిని ప్రశ్నించడంతో 12 మందిని అలవోకగా కాఫీలో, నీళ్లలో విషం ఇచ్చి వారితో తాగించి చంపేశాడు. ఈ కేసులో స్లమిక్ తోహేరీని ఇండోనేషియాలో పోలీసులు అరెస్టు చేశారు.   ఇండోనేషియాలో కూడా ఇలాంటి తాంత్రిక విద్యల పేరుతో మోసం చేసే వాళ్లు, వారి చేతిలో మోసపోయే వాళ్లు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు.

25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు 2019 వరకు కౌంటర్ పిట్ కరెన్సీ కేసులో ఇతడిని అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు 12 మందిని బ్లాక్ మ్యాజిక్  అనే పేరుతో మట్టుబెట్టాడు. అయితే గతంలో బ్లాక్ మ్యాజిక పేరుతో చంపినప్పటికీ పోలీసులు మాత్రం కౌంటర్ ఫిట్ కరెన్సీ అని కేసును ఫైల్ చేశారు.

బ్లాక్ మ్యాజిక్ బ్యాచ్ మొత్తం బంచర నగరం అనే ప్రాంతంలో ఉంటారు. వీరు భూత, ప్రేత పూజలు చేస్తుంటారు. ఇంతకుముందు కూడా యమాద్ స్వరాబ్ద్ అనే వ్యక్తిని  2008 సంవత్సరంలో 42 మందిని చంపిన కేసులో యమాద్ ను ఉరి తీశారు. అయితే మమాద్ కూడా ఇలాగే బ్లాక్ మ్యాజిక్ పేరుతో 42 మందిని చంపేశాడు. షమాన్స్ అంటే భూత ప్రేత మాంత్రికుడని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: