మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ఎవరనే దాని గురించి 6 నెలలకు ఒకసారి అమెరికా కు సంబంధించిన సంస్థ ప్రకటిస్తూ ఉంటుంది. బైడెన్, పుతిన్ లాంటి వారు కాకుండా మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. గతంలో ఆయన పాపులారిటీ 78 శాతం వస్తే ప్రస్తుతం 76 శాతంగా ఉంది.

మోస్ట్ పాపులారిటీ విభాగంలో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు  లోపెజ్ 61 శాతంతో ఉన్నారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆల్బనిస్ 59 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలియాన్ బెర్సెట్ 53 శాతంతో నాలుగో స్థానంతో, బ్రెజిల్ అధ్యక్షుడు సిల్వ 49 శాతంతో అయిదో స్థానంలో ఉన్నాడు. ఇటలీ అధ్యక్షుడు ఆరో స్థానంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నారు.

బెల్జియం అధ్యక్షుడు 39 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. తొమ్మిదో స్థానంలో కెనడా జస్టిస్ ట్రూడో ఉన్నారు. స్పెయిన్ 38 శాతంతో పదో స్థానంలో కొనసాగుతున్నారు. కరోనా తర్వాత నరేంద్ర మోదీ పాపులారిటీ అనేది 68 శాతానికి ఆయన పాపులారిటీ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఆయన 76 శాతం పాపులారిటీతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కరోనా రాకముందు  84 శాతంగా ఉన్న పాపులారిటీ ప్రస్తుతం కాస్త తగ్గినా మోదీయే ప్రపంచంలో నెంబర్ వన్ పాపులారిటీ నాయకుడిగా అని ప్రపంచంలోని ప్రజలు గుర్తిస్తున్నారు.

వరల్డ్ మోస్ట్ పాపులారిటీ సర్వేలో మళ్లీ మొదటి స్థానం దక్కడం భారతీయులకు గర్వకారణమనే అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది, ఎన్నో అభివృద్ది చెందిన దేశాల్లోని అధినేతలను కాదని ఇలా నరేంద్ర మోదీ పాపులర్ గా నిలుస్తున్నారు. పాపులారిటీ అనేది ప్రజా సేవ చేసే విధానాన్ని బట్టి వస్తుందని తెలుస్తోంది. మోదీ గొప్ప దౌత్య వేత్తగా వివిధ దేశాల మన్ననలు పొందుతూ మోస్ట్ పాపులారిటీ పర్సన్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: