మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

2018 తో టీడీపీతో విడిపోయిన తర్వాత బీజేపీని ఘోరంగా చంద్రబాబు అవమానించారు. ఎంతలా అంటే జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రచురించేలా, ప్రజల్లో పబ్లిసిటీ పెంచుకునేలా తీవ్రంగా కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఇంటి గెలిచి రచ్చ గెలవాలని అందరూ అనుకుంటారు. కానీ చంద్రబాబు రచ్చ గెలిచి ఇంట గెలవాలని అనుకున్నారు. కానీ ఇంట గెలవలేక.. రచ్చ గెలవలేక అధికారాన్ని కోల్పోయి 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన పరిస్థితి. దీంతో బీజేపీతో తీవ్ర వైరం పెరిగింది.

కానీ ప్రస్తుతం చంద్రబాబు మళ్లీ బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీ అధిష్టానం చంద్రబాబును నమ్మేందుకు భయపడుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు విమర్శించినట్లు ఆంధ్ర ప్రజల్లో బీజేపీ అంటేనే విద్వేషం పెంచేలా చేసేశారు. కానీ ప్రస్తుతం మాట్లాడుతున్న విధానం చూస్తే మేం బీజేపీతో బాగానే ఉన్నామని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ కూడా ప్రస్తుతం స్నేహంగానే మెలుగుతోంది కారణం జాతీయ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకుంటే ఫండ్స్ రావు. తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని భయపడుతున్నారు.

నడ్డా ను బీజేపీ లో క్లాసు పీకినట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నట్లు టీడీపీ అభిమానులు నడ్డాకు తెలపడంతో ఆయన చేసిన ఓ POST పై బీజేపీ అధిష్టానం మండి పడినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ విగ్రహం వద్ద కు ఆయన జయంతి సందర్భంగా నడ్డా వెళ్లడంపై కూడా ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

నడ్డాను ఎన్టీఆర్ జయంతికి రప్పించి తద్వారా బీజేపీ నాయకులతో సంబంధాలు మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ తో జతకట్టడం అనేది చారిత్రక తప్పిదం అని ఎంతోమంది అన్నారు. కానీ ఇప్పడు మళ్లీ బీజేపీ తోనే సఖ్యతగా ఉండాలని భావించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: