పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి  పోలవరం కంప్లీట్ చేయమని అడిగారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీ ధర్ రావుతో కూడా పవన్ సమావేశమై అమిత్ షా, మోడీల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పొత్తుల ఎత్తులు మార్చుకోవాలని అనుకున్నప్పుడు అమిత్ షా ను కలవాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. జేపీ నడ్డాతో కూడా పవన్ సమావేశమై బీజేపీ, జనసేన గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

బీజేపీ, జన సేన కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి.  పవన్ సూచిస్తున్న విధంగా పొత్తు పెట్టుకోవడానికి జనసేన అడిగే సీట్లను ఇవ్వడానికి టీడీపీ వెనుకంజ వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే జాతీయ పార్టీ నుంచి మద్దతు అవసరం అని పవన్ అనుకుంటున్నారు. పవన్ ఏకైక లక్ష్యం వైసీపీ ని ఓడించాలని కోరుకుంటున్నట్లు గతంలోనే చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా సమన్వయంతో దూసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీని ఓడించాలని అదే సమయంలో టీడీపీ కంటే బలంగా జనసేన తయారవ్వాలి. జనసేనను నమ్ముకున్న ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇది పవన్ ఒక్కడి వల్ల అవుతుందా? పార్టీకి బలం అభిమానులు, కార్యకర్తలు. వీరి నుంచి ఓట్లను రాబట్టుకోవడంలో ఈ సారి విఫలం కావొద్దని బలంగా కోరుకుంటున్నారు. బీజేపీతో కలిస్తే ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయొచ్చు. ఒక వేళ బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి వస్తే సీఎం పదవి దక్కుతుంది.

టీడీపీతో సీఎం పదవి గురించి బేరాసారాలు కూడా అస్సలు అవసరం ఉండవు. మరి పవన్ బీజేపీ నాయకులతో జరిపే చర్చలు సఫలమైతే బీజేపీ, జనసేన రెండింటి కలయికతో పోటీలో ఉండటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: