అమెరికాకు చుక్కలు చూపిస్తున్న గల్ఫ్‌ దేశాలు?

గల్ప్ దేశాలు, పాశ్చాత్య దేశాలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటి వరకు రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, యూరప్ దేశాలు ప్రస్తుతం అరబ్ దేశాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయి. గతంలో రష్యా నుంచి వచ్చే ఆయిల్ పై అమెరికా, యూరప్ దేశాలు ధరను నిర్ణయించేవి. ఆ దేశాలు చెప్పిన ధరకే అమ్మాలని అనేవి. యుద్ధానికి ముందు రష్యా ఆ దేశాలకు ఆయిల్ సప్లై చేసేది కాబట్టి ఆ విధానానికి ఒప్పుకుంది.

కానీ యుద్ధానంతరం రష్యా, భారత్, సహా ఇతర దేశాలకు ఆయిల్ సప్లై చేసి ఆదాయాన్ని సృష్టించుకుంటోంది. దీంతో ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు గల్ప్ దేశాలపై పడ్డాయి. అరబ్ దేశాలు సప్లై చేసే ఆయిల్ పై ప్రైస్ క్యాప్ తామే విధిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది.

గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అయ్యే ఆయిల్ ధరను నిర్ణయిస్తామని అమెరికా చెప్పడంతో  అరబ్బులు తీవ్రమైన నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారిగా అమెరికా, యూరప్ దేశాలకు ఆయిల్ పంపడాన్ని గల్ప్ దేశాలు నిషేధించాయి. గతంలో కూడా రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ను ఆయా పాశ్చాత్య దేశాలకు పంపడాన్ని  నిలిపివేశాయి. ప్రస్తుతం  1 మిలియన్ డాలర్ల విలువ చేసే  క్రూడాయిల్ ను ఆ దేశాలకు పంపడం లేదు.

మా దేశంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ పై అమెరికా ఏ విధంగా రేట్ ను నిర్ణయిస్తుందని గల్ఫ్ కంట్రీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. అమెరికాలో ఉత్పత్తి చేసే మందుల కంపెనీల రేట్లను ఇతర దేశాలు నిర్ణయించడం లేదు కదా అని విమర్శలు చేస్తున్నాయి. ఇలా అమెరికా యూరప్ దేశాలతో గల్ప్ దేశాలు ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లాయి. ప్రపంచాన్ని శాసించాలని అమెరికా, యూరప్ దేశాలు భావించడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని ఇది సరైన విధానం కాదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA

సంబంధిత వార్తలు: