ఆ ఒక్క డైలాగ్‌తో అమిత్ షా విశ్వరూపం చూపారా?

బిహార్ లో బీజేపీ అధికారంలోకి రాగానే అల్లర్లకు పాల్పడుతున్న రౌడీ మూకలు, ఇతర గ్యాంగులను తల్లకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ లో నితిశ్ కుమార్  మార్పులు తీసుకొచ్చినా పేదరికాన్ని తగ్గించలేకపోయారు. అక్కడున్న మెజారిటీ హిందువులు ఎక్కువగా ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. దీంతో బంగ్లాదేశ్ కు చెందిన ముస్లింలు ఇక్కడ పాతుకుపోయి అల్లర్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అమిత్ షా ఇచ్చిన మాస్ వార్నింగ్ బిహార్ లో సంచలనం సృష్టించేదే.

ససారంలో జరిగే భారీ బహిరంగ సభకు వెళ్లాల్సి ఉన్నారామనవమి రోజు జరిగిన అల్లర్లతో  అక్కడికి వెళ్లలేకపోయాను.  అయితే ఈ  అల్లర్లకు పాల్పడుతున్న వారందరికీ ఒక్క విషయం చెబుతున్నాను. ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారందరినీ బిహార్ లో తల్లకిందులుగా వేలాడదీస్తామని అమిత్ షా హెచ్చరించారు. ఇంతటి ఘాటూ వ్యాఖ్యలు చేయడం తో ఒక్కసారిగా బిహార్ లో రాజకీయ వేడి రగులుకుంది. బిహార్ లో చాలా ఏళ్ల నుంచే తుఫాకుల కల్చర్ ఉంటోంది. దారి దోపిడీలు, దొంగల ముఠాలు, అత్యాచారాలు, ఇలా ఎక్కడికెళ్లినా సరే ఇవే కనిపించేవి. నితీశ్ అధికారం చేపట్టాక కొన్ని తగ్గించినా, పేదరికాన్ని  మాత్రం తగ్గించలేకపోయారు.

బిహార్ లో బంగ్లాదేశీయుల జనాభా పెరిగిపోతున్న కారణంగా మత ఘర్షణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వాటిని రాష్ట్ర సర్కారు ఆపలేకపోతోందని కేంద్ర హోం మంత్రి అన్నారు.  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తామెంటో చూపిస్తామని అన్నారు. ప్రస్తుతం బిహార్ సీఎం  నితిశ్ కుమార్, లాలూ ప్రసాద్ కు చెందిన పార్టీ వాళ్లలో కలిసి పోయారు. గతంలో లాలూ హాయాంలో జరిగిన విధంగానే దాడులు పెరిగిపోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అక్కడి నితిశ్ కుమార్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా దేశ వ్యాప్తంగా ఎన్ని మార్పులు జరుగుతున్నా.. బిహార్ లో మాత్రం పేదరికం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: