అమెరికా ఔట్‌: ఇక డాలర్‌ ఆధిపత్యానికి చెక్‌ ?

భారత్ లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ దేశాన్ని పాలించింది. ఏకఛత్రాధిపత్యం అనేది శాశ్వతం కాదు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అలాంటిదే అమెరికన్ డాలర్ కూడా అదే పరిస్థితికి వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా తమ యువాన్ తోనే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. బ్రెజిల్ తో  ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

బ్రెజిల్, చైనా రెండు దేశాలు తమ కరెన్సీలలోనే ఇలా వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. డాలర్ డామినేట్ ను దెబ్బతీయాలని నిర్ణయం తీసుకున్నారు. చైనా ఇప్పటికే డాలర్ ను పక్కన బెట్టింది. 41 దేశాలు డాలర్ ను విడిచిపెట్టి సొంత కరెన్సీలతో నే వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకుంది. రష్యా, వెనిజులా, లాంటి దేశాలు తమ సొంత కరెన్సీలోనే వ్యాపారాలు మొదలు పెట్టాయి.

సౌత్ అమెరికాలో సొంత నోట్లు ఉండేలా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఐఎంఎప్, వరల్డ్ బ్యాంకు లాంటి వాటిని నుంచి వస్తున్న తేడా కనిపిస్తుందని చైనా కనిపెట్టింది. ఎక్చైంజ్ విధానంలో డాలర్ ను మెల్లిగా పక్కకు పెట్టాలని చైనా భావిస్తోంది. ఇప్పటికే తమ తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళుతున్నాయి. సొంత దేశపు కరెన్సీలతో నే వ్యాపారాలు చేస్తూ డాలర్ ను పక్కకు పెడుతున్నాయి.

తద్వారా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్న సమయంలో రష్యా తన రుబుల్ లో నే అన్ని పనులు చక్కదిద్దుకుంటోంది. ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్న లావాదేవీలు ఇతర దేశాలతో జరపాలన్న రుబుల్ లోనే నడిపిస్తోంది. దీంతో మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా తర్వాత అంత చక్కదిద్దుకుంది. ఇలా ఒక్కో దేశం డాలర్ ను కాదని తన సొంత కరెన్సీలో అన్ని పనులు చేసేస్తే ఆటోమెటిక్ గా డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కు తన బలం డాలరే దాన్ని దెబ్బతీయాలని చైనా, రష్యా భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: