కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

డ్రైవర్ లేకుండా కృత్రిమ మేధస్సుతో కారులను నడుపుకోవచ్చు అని టెస్లా కారులను తీసుకొచ్చిన టెస్లా అధినేత ఎలన్ మస్క్  సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క తొలి అంకం ఆయన మొదలు పెడితే, ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మలి అంకం లోకి వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఉద్యోగాలు వస్తుంటే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి.

దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దంటూ ప్రపంచం వ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ లేదా మేధావులు అందరూ కలిసి ఒక లేఖను రాశారు. 1000 మంది ఎక్స్పర్ట్ లు కలిసి ఈ లేఖను రాసినట్లుగా తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం చాలా ఉందంటూ లేఖను రాశారు. ఈ లేఖలో ఎలన్ మస్క్ తో సహా ఆపిల్ కంపెనీ సహ అధినేత స్టీజ్ భోజ్నియా కూడా తన సంతకాన్ని పెట్టినట్టుగా తెలుస్తుంది.

మొత్తం వెయ్యి మంది నిపుణులు దీనిపై సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది. మస్క్, ఆపిల్ సహాధినేత స్టీజ్ భోజ్నియా వీళ్ళందరూ పార్ట్ జియాన్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. ఏఐ ఆధారిత చాట్ పార్ట్ చాట్ జిపిటిని విడుదల చేసిన ఓపెన్ ఏఐ సంస్థ జిపిటి ఫోర్ పేరుతో మరింత అత్యాధునిక ఏఐ వ్యవస్థల్ని తీసుకొస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఈ లేఖల్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సంస్థకు ఎలన్ నిధులను సమకూరుస్తున్నారు.

అందరూ కలిసి అడిగేది ఏంటంటే మానవ మేధస్సుతో పోటీపడే ఏఐ లాంటి వ్యవస్థలు సమాజానికి తీవ్ర ముప్పును కలిగించే ప్రమాదం ఉందని వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. సానుకూల ప్రభావాన్ని చూపే ఏఐ వ్యవస్థను మాత్రమే అభివృద్ధి చేయాలని, ఒక వేళ ప్రతికూల ప్రభావం చూపితే కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీతో అది ఉండాలని ఈ మేధావులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: