తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటుందా?

కార్పొరేషన్లు, పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఊపు కోసం ఆంధ్ర ప్రాంతంలో కిందటిసారి మహానాడు పెట్టి, ఈ సంవత్సరం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దఫా అక్కడ పెడుతున్నారు. ఇదంతా ఎందుకని అంటే అక్కడ తెలంగాణలో కూడా  తెలుగుదేశం పార్టీకి  సంబంధించి తిరిగి ఉత్సాహం నింపడం కోసం అక్కడ కూడా ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అక్కడకు ఆంధ్రా నుండి వేల మంది వెళ్తారు. తెలంగాణలో చతికిల పడిపోయిన తెలుగుదేశం పార్టీని పునరుద్ధరించడం కోసం, అదే సందర్భంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో నెగ్గిన ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఈ మహానాడుని ఒక వేదికగా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే ఎన్నికల్లో వేసినటువంటి వ్యూహం తో విజయం సాధించిన సందర్భంలో, మార్చ్ 28న జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి చాలాకాలం తర్వాత జరిగిన పాలెట్ బ్యూరో మీటింగ్ లో త్వరలో తెలంగాణలో జరగబోయే మహానాడు తో సహా పలు అంశాల గురించి చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది.

తెలంగాణలో ఈ మహానాడు అనేది ఈ ఏడాది మే నెలలో జరగబోతున్నట్లుగా చెప్తున్నారు. మార్చి 29వ తేదీన పార్టీ ప్రతినిధుల సభలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఘనంగానే జరిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రాష్ట్రాల నుంచి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు హాజరయ్యారు.

ఏపీ నుంచి సభకు వెళ్లిన పాలి బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో జోన్ వన్, జోన్ ఫోర్, జోన్ ఫైవ్ సమావేశాలు నిర్వహిస్తూ వాటి ద్వారా చంద్రబాబు నాయుడు తో సహా రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేసారు. అధినేత నుంచి కార్యకర్తలు దాకా క్షేత్రస్థాయిలో ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఆ విధంగా భవిష్యత్తు రాజకీయం మాదే అని చెప్పబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: