ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?

దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మెడికల్ కాలేజీలు తామే నిర్మించుకుంటున్నట్లు చెప్పుకుంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి కోరింది. అందులో మూడింటిని  కేంద్రం రిజక్ట్ చేసింది.

ఏలూరు, మచిలీ పట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీలను రిజక్ట్ చేసింది.  నంద్యాలలో కూడా సరైన భవన నిర్మాణాలు జరగట్లేదని ఆక్షేపించింది. మెడికల్ కాలేజీకి పెద్ద భవనం, గ్రౌండ్, మౌలిక వసతులు, అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలని నిర్దేశించింది. ల్యాబ్ లు ఉండాలి. గాలి, వెలుతురు వచ్చేలా తరగతి గదులు ఉండాలని చెప్పింది. ఎంసెట్ పరీక్షలు అయిపోగానే క్లాసులు ప్రారంభమవుతాయి.

నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఈ మూడు కాలేజీల్లో మౌలిక వసతులు సరి చేయాలని కోరింది. లేకపోతే ఆ కాలేజీల అనుమతిని రద్దు చేస్తామని చెప్పింది. దీంతో ఆంధ్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో కచ్చితంగా వారు ఏం చెప్పారో వాటిన్నింటిని తూచ తప్పకుండా చేయాలి. ప్రస్తుతం చేస్తామని కూడా చెప్పారు. ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం, అనుమతి నిరాకరణ జరిగితే అక్కడ లోకల్ లో ఉండే విద్యార్ధులకు చాలా వరకు నష్టం కలుగుతుంది.

దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తిపోస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏయే మెడికల్ కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా లేవో అక్కడ ముందుగా పనులు పూర్తి చేయాలి. ఎంత ఖర్చయినా సరే వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అలా కల్పించినపుడే అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన తరగతులు ప్రారంభం అవుతాయి. మెడికల్ కాలేజీల నిర్మాణంలో వైద్య విద్య విద్యార్థులకు దగ్గరవుతుంది. ఎక్కువ మంది డాక్టర్లుగా తయారవుతారు. వేగంగా పనులు చేసి తరగతులు నిర్వహించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: