ఆ రంగంలో అద్భుతాలు సాధిస్తున్న జగన్‌?

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పగ్గాలు చేపట్టాక ప్రభుత్వ విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా కొన్ని విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టారు. అది ఎక్కువగా ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా ఉండేది.కానీ జగన్ ప్రభుత్వం స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చదువుకునే పేద విద్యార్థులకు సైతం అంతేలా చూస్తున్నారు.

గతంలో ఇంటర్మీడియట్ లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు పదో తరగతి లోపు చదువుకునే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ జగన్ ప్రభుత్వం ఇస్తుంది. 2018, 19 సంవత్సరంలో ఇంజనీరింగ్ వృత్తివిద్య కోర్సులు చేసినటువంటి వారు 87 వేలపైన మంది ఉంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 సంవత్సరంలో వారి సంఖ్య 1,10,000 పైనే ఉంది. ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్థులు డిగ్రీలో చాలామంది ఉన్నారు.

ఇలా డ్రాప్ అయిన విద్యార్థులు 2018 19 సంవత్సరం నాటికి 81,238 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 2023 సంవత్సరం నాటికి 23 వేల మంది మాత్రమే ఉన్నారు. అంటే డ్రాపౌట్ల సంఖ్య నాలుగేళ్లలో చాలా మేరకు తగ్గిందని తెలుస్తోంది. ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్థులు దేశ మొత్తం మీద 27% మంది ఉంటే  ఆంధ్రాలో కేవలం 6.2% మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది.

అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్లలో 2018 19 సంవత్సరం నాటికి 35000 మందికి ఉద్యోగాలు దొరికితే ప్రస్తుతం 2022, 23 నాటికి 87 వేల మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు దొరుకుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఫీజు రీయింబర్స్మెంట్ సరైన సమయానికి అందడం గవర్నమెంట్ ప్రభుత్వ విద్యాలయాలు ప్రభుత్వ కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అని తెలుస్తుంది. ఏదేమైనా గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల విద్యారంగంలో కాస్త మెరుగుదల కనిపించినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: