ఆఫ్రికా ఖండం అంతా అట్టుడికిపోతుందిగా?

ఆఫ్రికా ఖండం అట్టుడికి పోతోంది. ఆఫ్రికన్ లోని చాలా దేశాలలో ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉద్యమ పాటలు పడుతున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఉపాధి అవకాశాలు పెంచాలని, పెరుగుతున్న ధరలు తగ్గించాలని ఇలా ఒక దేశంలోని ప్రజలకు కావాల్సిన, వాళ్ల బ్రతుకు తెరువు కోసం ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పనులు ప్రభుత్వం చేయకపోవడంతో వీటి కారణంగా నిరాశ, నిస్పృహలతో కదిలిపోతున్న ప్రజలు అక్కడ ఉద్యమాలకు పాల్పడుతున్నారు. దాంతో వారు పాలకులను గద్దె దిగమని డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వాస్తవంగా అయితే దక్షిణాఫ్రికాకు సంబంధించి నేషనల్ షట్ డౌన్ జరిగింది. అంటే బంద్ జరిగింది అక్కడ. రాంపోస ప్రభుత్వం దిగిపోవాలని అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. చివరికి పోలీసులను పెట్టినా, ప్రైవేట్ రక్షణ వ్యవస్థను పెట్టినా కూడా అక్కడ ఉద్యమాలు ఆగడం లేదు. కరోనా ముందటి పరిస్థితి కావాలంటూ హై అన్ ఎంప్లయ్మెంటు, కరెంటు కోతలు  వీటిపై కూడా ముఖ్యంగా కోపంతో రగిలిపోతున్నారు అక్కడ జనం.

వీళ్ళ కష్టాలను తీర్చాలనే క్రమంలో వీళ్ళకి అక్కడ విపక్షాలు కూడా అండగా నిలుస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాదే అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి. మరోవైపు క్రిమినల్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజలకు రక్షణ లేదని ఉద్యమం కూడా అక్కడ జరుగుతుంది. అక్కడ కెన్యాలో కూడా  సేమ్ పరిస్థితి ఉంది. అక్కడ నైరోబీలో బందు జరిగి, దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

నైబీరియాలో అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందన్న గొడవలో కూడా అక్కడ విద్వాంసాలు జరుగుతున్నాయి. అక్కడ టునీషియాలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. మరొక పక్క సెనెగల్ లో విపక్షంతో జరుగుతున్న ఉద్యమం ఉద్రిక్త వాతావరణానికి తీసుకు వెళుతుంది. అక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కారణంతో  ఉద్యమాలు రగిలిపోతున్న పరిస్థితి ఏర్పడింది అక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: