పుతిన్‌పై పోరులో అమెరికా చేతులెత్తేసిందా?

రష్యా పై యుద్ధానికి ఉక్రెయిన్ ను ఎగదోసిన అమెరికా ప్రస్తుతం అలసిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఉక్రెయిన్ లోని ప్రాంతాలను రోజురోజుకు కోల్పోతున్నారు. జెపోజజరియా, కేర్సన్, లూహన్స్కీ, డోనెట్క్సీ, మరియపోల్ లాంటి ప్రాంతాలను ఇప్పటికే రష్యా సైన్యం తమ వశం చేసుకుంది. అమెరికా, యూరప్ దేశాలు చేసిన పనుల వల్ల ఇప్పుడు ఉక్రెయిన్ శిక్ష అనుభవిస్తోంది.

ఉక్రెయిన్ మాత్రం ఎంత జరిగినా యుద్ధంలో తగ్గేది లేదంటున్నాయి. అమెరికా ఇప్పటికే ఎక్కువ ఆయుధాలను ఇస్తోంది. ఇప్పటి వరకు యుద్ధంలో అనేక మిస్సైల్స్, యుద్ధ ట్యాంకులు పంపింది. దీంతోనే ఉక్రెయిన్ ఇంకా యుద్దం చేస్తుంది. అమెరికా దాచుకున్నటువంటి యుద్ద సామగ్రిని కూడా ఇప్పుడు ఇఛ్చేస్తే అగ్రరాజ్యం పైకి కనక రష్యా, చైనా లాంటి దేశాలు యుద్ధం చేయడానికి వస్తే ఏంటి అన్న పరిస్థితి తలెత్తుతుంది.

కాబట్టి అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్ కు చాలా వరకు సాయం చేసింది. కానీ మొత్తానికే మోసం జరిగే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. రష్యాకు ఆయుధాలు అయిపోతే ఇరాన్, చైనా, ముడి పదార్థాలను సరఫరా చేస్తున్నాయి. దాంతో ఆయుధాలను తయారు చేసుకుంటూ యుద్ధంలో పోరాడుతున్నట్లు చెబుతోంది.కానీ అమెరికా పరిస్థితి అలా కాదు. రక్షణ రంగంలో మెరుగ్గా ఉండి ఏదేశంతోనైనా పోరాడే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ ప్రస్తుత సమయంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ పోరాటం కొనసాగిస్తుంది. కానీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చేసింది.

యూరప్ దేశాలు కూడా కొంత వరకు ఆయుధాలు ఇచ్చాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో కూడా ఆయిల్ కొరతతో తీవ్ర  ఇక్కట్లు పడుతున్నాయి. యూరప్ దేశాలు, బ్రిటన్, అమెరికా దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. ఇంకా పోరాడేందుకు అమెరికా వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ మాత్రం ఇప్పటివరకు ఎదుర్కొని ఇబ్బందులను పడుతుంది. యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింటోంది. రష్యా భీకర దాడులను తట్టుకుని ఎలా ముందుకెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: