తాలిబన్లతో ఇండియా దోస్తీ.. పాములకు పాలు పోస్తున్నామా?

తాలిబన్లకు మనం శిక్షణ ఇవ్వబోతున్నాం. ఆ శిక్షణ కూడా ఆయుధాలను వాడడంలోనో, దౌర్జన్యం చేయడంలోనో కాదు. దౌత్యంలో, విదేశాంగ విధానంలో, భాషలో , బిహేవియర్ లో శిక్షణ ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించిన క్లాసులు ఈ మధ్యనే మొదలయ్యాయి అని తెలుస్తుంది. క్రాష్ కోర్స్ విధానంలో వాళ్ల కోసమే ఇది జరుగుతుందని తెలుస్తుంది.

కల్చర్, లెజిస్లేషన్, బిజినెస్ ఈ మూడింటిలో వాళ్లకి ట్రైనింగ్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కి శిక్షణ అయిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక బ్యాచ్ వస్తే దాన్ని కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. కోజికోడ్ లోని ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీన్ని నిర్వహిస్తుంది. ఈ ఐఐఎం బ్రాంచులు దేశంలో 20ఉన్నాయని తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే దీనిలో శిక్షణను ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లోని విదేశాంగ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంతమంది శిక్షణను తీసుకున్నారు. మరి కొంతమంది ఆన్లైన్లో శిక్షణను పొందుతున్నారు. ఫిబ్రవరిలో మన విదేశాంగ శాఖ వాళ్ళతో జరుపుకున్న ఒప్పందాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఎక్సలెన్సీ లో భాగంగా వాళ్లకు ఇంగ్లీషులో అధెంటిసిటీ వచ్చేలా  చెప్పడం, దౌత్య విధానంలో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు.

మన దేశానికి సంబంధించిన ఐఐఎం లు తాలిబాన్లకు మాత్రమే కాకుండా మాల్దీవులు వాసులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. థాయిలాండ్ వాళ్లకి కూడా శిక్షణ ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే తాలిబాన్లకు, మనకు ఎటువంటి శత్రుత్వం లేదు. వాళ్లకి మనకి మధ్య సాంస్కృతికపరమైన విభజన అయితే ఉంది. కానీ భారతదేశమనేది అన్ని సంస్కృతులను ఆహ్వానిస్తుంది.  తాలిబాన్లు  క్రైస్తవ సంస్కృతినో, బౌద్ధ సంస్కృతినో, ఇస్లాం సంస్కృతినో ఫాలో అవుతారు గాని, హిందూ సంస్కృతిని వాళ్ళు ఫాలో అవ్వరు. మనం ఇస్లాం సంస్కృతిని కూడా ఆహ్వానిస్తాం కాబట్టి వాళ్లు కూడా మంచిగా ఉండాలని అనుకుంటాం కాబట్టి జరుగుతున్న ప్రయత్నం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: