టీడీపీ దెబ్బతో బిత్తర పోయిన వైసీపీ క్యాడర్?

ఏదైనా జగన్ చూసుకుంటాడు అసలు ఓటమనే పదమే మాకు తెలియదు అని మాట్లాడిన వైసిపి కేడర్ ఇప్పుడు బిత్తర పోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ లో వచ్చిన విజయాలు ఇక రాబోయేటటువంటి ఎలక్షన్ లో  వై నాట్ 175 అని ధీమాగా ఉన్నటువంటి జగన్ పెద్ద ఎత్తు ఏదో వేసాడు అని నమ్మినటువంటి వైసీపీ క్యాడర్ ఒకసారిగా బిత్తర పోయింది.

విషయంలోకి వెళ్తే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగాయో, అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ప్రత్యక్ష ఎన్నికల్లో వాటిలో 106 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రాంతాలుగా చెప్పేటువంటి మూడేసి ఉమ్మడి జిల్లాలు, మొత్తంగా చెప్పాలంటే 9 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, అంటే ఇదివరకు మనకున్నటువంటి 13 లో నాలుగు పోను 9, దాంట్లో మూడింట్లో  రెండిట్లో తెలుగుదేశం భారీ విజయాలను సంపాదించుకోగా, ఒకటి నెక్ టూ నెక్ అయ్యాయి.

ఈ మూడింటి ఇంపాక్ట్ అనేది ఆషామాషీ కాదు. అంటే  విద్యావంతులైనటువంటి వాళ్ళు ఈసారి  దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. టీచర్లు గ్రాడ్యుయేట్లు ఈ రెండిటికి సంబంధించిన ఎన్నికల్లో టీచర్ల భాగంలో విజయం సాధించగానే పండగ చేసుకున్న వైయస్సార్సీపీ శ్రేణులకు ఇది ఊహించని షాక్. దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటని ఆందోళన, ఆవేదన వ్యక్తం అయ్యినటువంటి పరిస్థితి .

దానికి సమాధానం చెప్పేవారు గాని, దానికి సంబంధించిన వివరణ ఇచ్చేవారు గానీ పార్టీలో ఉన్న నాయకులు వద్ద లేకపోవడం. నాయకుడికి క్యాడర్ కి మధ్య ఉన్న గ్యాప్ కూడా, సాధారణంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలో, ఎంపీలో కార్యకర్తలతో మమేకమై ఈ తప్పుల వల్ల ఈ స్థానాల్లో మనం గెలుచుకోలేకపోయాం, అలాగే ఈ ప్లస్ పాయింట్లతో ఈ స్థానాల్లో విజయం సాధించామని, ఇలా ఓటమి గురించో, గెలిచిన విజయం గురించో, విశ్లేషించి చెప్పేవాళ్ళు లేకపోవడం ఒక మైనస్ గా కనిపిస్తుంది. భవిష్యత్తు మీద ఉన్న నమ్మకం పోయి ఆందోళన కలుగుతున్న పరిస్థితి ఎదురైంది వాళ్ళకి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: