గుట్టురట్టు: ఇక పాక్‌ తిత్తి తీయనున్న రష్యా?

అమెరికా, యూరప్ దేశాలతో సన్నిహితులుగా ఉంటూ ఉక్రెయిన్ కు పాక్ ఆయుధాలు ఇచ్చినట్లు రష్యా తేల్చిచెప్పింది. మొన్నటికి మొన్న రష్యాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన పాకిస్తాన్ దేశానికి రష్యా ఇచ్చిన వివరణతో మైండ్ బ్లాక్ అయిపోయింది.
పాకిస్తాన్ నుంచి ఉక్రెయిన్ కు రహస్యంగా ఆయుధాలను సరఫరా చేసింది పాకిస్తాన్.  అయితే ఈ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ప్రపంచ దేశాలకు తెలియకుండా అత్యంత రహస్యంగా పంపించింది.

అయితే రష్యా ఉక్రేయిన్ యుద్ధం లో ఉక్రెయిన్ ఉపయోగించినటువంటి మిస్సైల్స్ రష్యా పేల్చేసింది.  దానిపైన ఉన్న నెంబరు అక్కడ ఉన్న శకలాలపై అవి పాకిస్తాన్ కు చెందినటువంటి మిస్సైల్ గా రష్యా సైన్యం గుర్తించింది. అప్పుడు రష్యా రహస్యంగా విచారణ చేసి పాకిస్తాన్ ఎప్పుడు ఏక్కడి నుంచి ఎప్పటి వరకు ఆయుధాలు అందించిందని కూపీ లాగింది. దీనివల్ల రష్యా పాకిస్తాన్ ఇచ్చినటువంటి ఆయుధాలు ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు అనే పూర్తి వివరాలను సేకరించింది.

పాకిస్తాన్ ను  రష్యా అడిగింది మీరెందుకు ఉగ్ర వాదులకు ఆయుధాలు ఇచ్చారు. మీ పేరు ఉన్నటువంటి.  మిస్సైల్ మీరిచ్చిందే కదా అని అన్నారు. దీనితో పాక్ మాట మార్చింది మేమేమీ ఆయుధాలు వారికి ఇవ్వలేదు యుద్ధ విమానాలు కానీ యుద్ధాన్ని మిగతా ఆయుధాలు ఏమి ఇవ్వలేదు కేవలం రా మెటీరియల్స్ మాత్రమే పంపించాము అని రష్యాకు చెప్పింది.

రష్యా పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది మొన్నటి వరకు మాకు మద్దతు ఇస్తామని చెప్పినటువంటి పాకిస్తాన్  ఫ్లేట్ ఫిరాయించడంతో రష్యా అగ్గిమీద గుగ్గిలమవుతుంది. భారత్ లాగా తటస్థంగా ఉండడం పాకిస్థాన్ కు చేతకాదు. ఇప్పుడు పాకిస్తాన్ కు రష్యా నుంచి ఎలాంటి సాయం అందదు. అయితే రష్యాకు కూడా ఇరాన్ ఆయుధాలు ఇచ్చినట్టు అమెరికా స్పష్టం చేసింది. మరి ఇటు రష్యాకు పాకిస్తాన్ కీవ్ కు ఆయుధాలు ఇవ్వడంతో సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: