కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

అధికారాలు మాకు మాత్రమే ఉంటాయి ఎదుటి వాళ్ళకి ఉండవు అనే విచిత్రమైన ఆలోచన నుండి కేసీఆర్ బయటకు వస్తే చాలా మంచిది. మంచి చేసినప్పుడు మంచిగా చెప్పుకుంటారు. చెడు చేసినప్పుడు చెడ్డ గానే చెప్పుకుంటారు. ఇప్పుడు కవితకు ఏమైనా మహారాజ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అధికారాలు ఏమైనా ఇవ్వబడ్డాయా, ఆవిడ విచారణకి అటెండ్ అవ్వక్కర్లేదు అనడానికి.

ఆమె మీద దొంగ కేసులు పెట్టారు అంటే చంద్రబాబు మీద కేసీఆర్ పెట్టింది కూడా అంతేనా!  రేవంత్ మీద పెట్టింది కూడా దొంగ కేసేనా. రేవంత్ రెడ్డి డబ్బులతో దొరికిపోయాడు మరి ఇక్కడ కూడా డబ్బుల కుంభకోణంలోనే కదా దొరికింది. అదే సందర్భంలో మొన్న సంతోష్ వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటి? పెద్ద పోస్టర్లు వేశారు కదా. ఏ డబ్బులు దొరికాయాని? ఏ మనిషి దొరకాడని?

ఇక్కడ డైరెక్ట్ గా సీసీటీవీ ఫుటేజ్ లో మనిషి కనపడుతుంది, సెల్ ఫోన్ల ధ్వంసం కనపడుతుంది, వాళ్ళతో జరిగిన చర్చలు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఏమీ జరగలేదంటారు. అదే సంతోష్ మాట్లాడాడు,మెసేజ్ పెట్టాడు కాబట్టి స్కాం జరిగిపోయింది. ఇక్కడ మెసేజ్ ఏంటి, లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్స్ ధ్వంసం చేసేస్తే దాని అర్ధం ఏం జరగలేదనా ?

రెండవది ఇక్కడ వ్యాపారం జరుగుతుందా లేదా? రామ చంద్ర పిళ్లై కరెక్టా కాదా!  అభిషేక్ మన వాడే కదా! వాళ్ళేమైనా పుట్టుకతోనే కోటీశ్వరులా, అనుకుంటే ఈ వ్యాపారంలో వాళ్లు మాత్రమే చేస్తున్నారు అనడానికి. అదేదో చెప్పచ్చు కదా. రెండోది వి6 వాటిని నిషేధించి మళ్లీ పత్రిక స్వేచ్ఛ గురించి మాట్లాడడం, ఇంతకుముందు ఆంధ్రజ్యోతి, టీవీ9 పై బ్యాన్ విధించి ఇప్పుడు అదే టీవీ9 కి తోడుగా నిలబడ్డారు. అసలు ఏం చేస్తున్నారు. అంటే  వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అని వాళ్ళ భావమా? ఫోన్స్ ధ్వంసం చేయడానికి కారణం భయం కాదా? అని కొంత మంది వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: