ఆ దేశం విషయంలో అమెరికా ఘోర తప్పిదం?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతోందంటే దీనికి కారణం అమెరికా. ఇదే అమెరికా 20 ఏళ్లు ఆప్గానిస్తాన్ లో తన పాలన కొనసాగించి అక్కడి పిల్లలు, యువత స్కూళ్లు, కాలేజీలు, చదువుకోవాలని అంటూ అన్ని అలవాటు చేసి సడెన్ గా ఆ దేశాన్ని తాలిబాన్లకు విడిచి పెట్టి వచ్చేసింది. 20 ఏళ్లుగా ప్రజాస్వామ్యయుతంగా బతుకుతున్నామని అనుకున్నారు. కానీ తాలిబాన్లకు దేశాన్ని విడిచిపెట్టి రావడంతో అక్కడ పెద్ద మారణకాండే జరిగింది.

యూరప్ దేశాలు, బ్రిటన్, అమెరికా అన్ని కలిసి తాలిబాన్లను ఎందుకు ఓడించలేకపోయాయి. మరి ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు ఆఫ్గాన్ ను ఖాళీ చేయాలనిపించింది. మళ్లీ తాలిబాన్ల అరాచక పాలనను ప్రజలు అనుభవించేలా చేసింది అమెరికానే అని ప్రపంచ దేశాలు విమర్శించాయి. కాబూల్ వరకు తాలిబాన్లు ఎలా వచ్చారు. అమెరికా సైన్యం నిద్రపోయిందా.. సైనిక హెలిక్యాప్టర్లలో పారిపోయి రావాల్సిన అవరసం ఏం వచ్చింది. ఎయిర్ పోర్టు సమీపంలో అతి పెద్ద బాంబు ఎటాక్ ఎలా జరిగింది. దీనికి కారకులెవరూ. ఆ బాంబు దాడిలో దాదాపు 170 మందికి పైగా చనిపోయారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎయిర్ పోర్టు వద్ద అమెరికా సైన్యం కాపలా కాస్తుంటే ఆ ప్రాంతంలో అతి పెద్ద సూసైడ్ బాంబ్ ఎటాక్ జరగడం అనేది దారుణమైన అంశం.

కాబూల్ విమానాశ్రయానికి అధికారిగా ఉన్న యూఎస్ మిలిటరీ ఆఫీసర్ అక్కడ బాంబు దాడిలో 170 మందికి పైగా చనిపోవడం ఆనాడు అమెరికా తీసుకున్న నిర్ణయమే వారి చావుకు కారణమైందని పేర్కొన్నారు. అమెరికా అనుకుంటే తాలిబాన్లను ఏరివేయడం పెద్ద పనేం కాదు . 20 ఏళ్ల వరకు ఆఫ్గాన్ ను పాలించింది. తాలిబాన్లను ఎదిరించ లేక పోయిందనేది పొరపాటే. ఎందుకంటే అక్కడ ఉన్న వనరుల్ని దోచుకుని ఏమీ లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికని అక్కడి నుంచి ఖాళీ చేసిందని ప్రపంచ దేశాల్లో అమెరికాను విమర్శించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: