కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

పాకిస్థాన్ దేశానికి బుద్ది ఉండదు అని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశంపై గతంలో తీర్మానం పెట్టాం. అప్పటి రెపరెండం కాదు ప్రస్తుతం పెట్టి కాశ్మీర్ ను మాకు ఇచ్చేయాలని పాక్ అమెరికాను కోరుతుంది. ఎందుకంటే గతంలో ఐక్యరాజ్య సమితిలో రెపరెండం పెట్టినపుడు కాశ్మీర్ లోయలో హిందువులు ఎక్కువగా నివసించే వారు. అక్కడ హిందువులను ఊచకోత కోసి ప్రాణాలతో బతకకుండా చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

ఇప్పుడు ముస్లింల జనాభా ఎక్కువగా అయింది. అందులో పాకిస్థాన్ అనుకూల జనం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు రెపరెండం పెట్టమని కోరుతోంది. బుద్ది లేని మాటలు మాట్లాడటంలో పాకిస్థాన్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. దీనిపై ఐక్యరాజ్య సమితి గతంలోనే చెప్పిన విషయం ఏమిటంటే పాక్, భారత్ లు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి. దీనిలో మూడో దేశం మధ్యలో రాదని చెప్పింది. ఈ విధంగా ఆయా దేశాలతో సంతకాలు పెట్టించుకుంది. తీవ్రవాదం, ఉగ్రవాదం, కాశ్మీర్ అంశంపై విబేధాలతో నే పాకిస్థాన్ తో మన దేశం దూరంగా ఉంటోంది.  

అసలు విషయం ఏమిటంటే ఇండియాలో ఏ మాత్రం టెర్రరిస్టు ఎటాక్ జరిగినా.. అది పాకిస్థాన్ నుంచి జరిగినట్లు తేలినా ఇండియా డైరెక్టుగా పాక్ తో యుద్ధం చేసేందుకు సిద్ధమయినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు విశ్వసనీయంగా అందిన సమాచారం. అందుకే ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేము. మీరు కూర్చోని పరిష్కరించుకోవాలని అమెరికా చెబుతోంది.

ముఖ్యంగా భారత్ లో కాశ్మీర్ అంతర్బాగం అనే అంశాన్ని ఎప్పటి నుంచో వాదిస్తూనే ఉన్నాం. కానీ పాకిస్థాన్ కావాలనే అంతర్జాతీయ వేదికలపై భారత్ పై విష ప్రచారం చేస్తూనే ఉంటుంది. అమెరికా ఏమైనా మద్దతు ఇస్తుందా అంటే ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు సపోర్టు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తుంది. కాబట్టి పాక్ కు ఈ విషయంలో ఎలాంటి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: