జంబలకిడిపంబ: అమ్మాయిలకు కట్నం ఇవ్వాల్సిందే?

గురజాడ వారి కన్యాశుల్కం నాటకం గుర్తుండే ఉంటుంది అందరికి. గతంలో కన్యాశుల్కం ఉండేది. ఒక అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే వారు. ఆ తర్వాత కాలంలో అబ్బాయికి కట్నం ఇచ్చి అమ్మాయి వెళ్లడం. సుదీర్ఘ కాలం కొనసాగుతూనే ఉంది. కానీ కాలం మారింది. మళ్లీ తాతల కాలం నాటి కన్యాశుల్కం వచ్చేసింది. ఎక్కడో కాదు తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఇటీవల.. జరగాల్సిన ఓ పెళ్లి అమ్మాయికి కట్నం తక్కువ ఇచ్చారని వధువు, ఆమె తరఫు బంధువులు చివరి నిమిషంలో పెళ్లిపందిరిలోకి రాలేదు.

దీంతో విస్తుపోవాల్సిన పరిస్థితి వరుడు, అతని తరఫు బంధువులది. మేడ్చల్ జిల్లా పోచారం గ్రామానికి చెందిన యువకుడికి అశ్వారావుపేట గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. కట్నంగా అమ్మాయికి రెండు లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తీరా చూస్తే పెళ్లి సమయం వచ్చే సరికి మరో రెండు లక్షలు ఇవ్వాలని లేకపోతే పెళ్లి చేసుకోమని పెళ్లికూతురు తరపున వాళ్లు రాలేదు. దీంతో పెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది. వేరే కారణాలు ఏమైనా ఉంటాయోమని విచారిస్తున్న ఇప్పటి వరకు తెలిసిన అసలైన కారణం ఇదే.

ప్రస్తుత సమాజంలో నడుస్తున్నది వరకట్నం. అందరూ అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్లేటపుడు వర కట్నం రూపంలో తీసుకెళుతుంటారు. కానీ రోజులు మారాయి. మేం మారామని అమ్మాయిలు, ఆమె తరపున ఉండే బంధువులు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇకపై వరకట్నం బదులు, కన్యాశుల్కానికి డిమాండ్ ఉంటుందేమో.. కానీ రెండు చట్టపరంగా నిషేధమే.

కాస్తో కూస్తో వరకట్నమే బెటర్ అనే సమాజం ఉంది. ఎందుకంటే ఇష్టమున్న వరుడికి, మంచి జాబ్, ఇళ్లు, బంగ్లా, కారు ఇవన్నీ చూసి చేసుకుంటారు. అదే అప్పట్లో కన్యాశుల్కం అయితే 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఎక్కువ డబ్బులిచ్చి కన్యాశుల్కం  ద్వారా 15, 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకునే వారు. అలాంటి రోజులు రావద్దనే కోరుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: