కవిత: మోదీతో పెట్టుకుని కేసీఆర్‌ తప్పు చేశారా?

అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ ఇచ్చిన వాంగూల్మం ఆధారంగా కవిత దోషి అయిపోతుందా అని బీఆర్ఎస్ వర్గాలు, కవిత కూడా వాదనలు వినిపిస్తోంది. అయితే ఈడీ ఎవరో చెప్పిన ఆధారాలను బేస్ చేసుకుని పని చేయదు.  ప్రతి ఒక్క విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించిన తర్వాతనే అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతి, సోమయాజులు, నందకిషోర్ లను అరెస్టు చేసి ఏకంగా అమిత్ షా, ప్రధాని మోడీ, బీఎల్ సంతోష్ లను ఇరికించాలని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆలోచించారు.

అయితే  ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు సమావేశమయింది బీఆర్ఎస్ నేత ఫాంహౌస్ లోనే వారు మాట్లాడింది అక్కడే.  వచ్చిన వారు ఆ ఎమ్మెల్యేలకు అనుకూలమైన వారే. గతంలో వారికి పరిచయాలు ఉన్నాయి. అయినా 100 కోట్ల ముడుపులు తీసుకోవాలని పార్టీ మారాలని కోరారని కేసు పెట్టారు.

అయితే ఇందుకు అమిత్ షా ప్రయత్నించినట్లు బీఆర్ ఎస్ ప్రచారం చేసుకొచ్చింది. కానీ అక్కడ వంద కోట్ల రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి  దొరకలేదు. కానీ కవిత విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కాాం లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను ఈడీ అరెస్టు చేసింది. దీని వల్ల కవితకు కూడా ఉచ్చు బిగుస్తోంది.

ఫోన్లను ధ్వంసం ఎందుకు చేశారు. ఏ హోటళ్లో ఏ సమయంలో లిక్కర్ స్కాం గురించి కలిశారు. ఎన్నికోట్లకు ఢీల్ కుదుర్చుకున్నారనే పూర్తి వివరాలను ఈడీ సేకరించింది. దీని గురించి బీఆర్ ఎస్ నేతలు మాట్లాడరు. కేవలం ఇద్దరి ఇచ్చిన స్టేట్ మెంట్ లను ఆధారం చేసుకుని కవితను ఎలా విచారిస్తారు. ఏ విధంగా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. వివాదాలను సృష్టిస్తే అవి మనకే తగులుతాయని తన దాకా వస్తే కానీ బీఆర్ ఎస్ నేతలకు తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: