అమెరికా అండగా ఉన్నా.. ఓటమి అంచున ఉక్రెయిన్‌?

ఉక్రెయిన్ లోని లూహన్ స్కీ, కేర్సన్, డొనెస్ట, మరియపోల్, జెపోజెజరియా అనే ప్రాంతాల్లో రష్యా ఇప్పటికే పట్టు సాధించింది. అయితే గతంలో ఉక్రెయిన్ లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పర్యటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుండగా రష్యా విదేశాంగ మంత్రి మరియపోల్ లో పర్యటించారు. ఇది ఇక్కడ జరిగిన సంచలన అంశం.

ఒక పక్క యుద్దం జరుగుతుంది. ఆక్రమించుకున్న ప్రదేశాల్లో రష్యా కు చెందిన మంత్రి రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రదేశానికి వెళ్లి రష్యా సైనికులకు ధైర్యాన్ని చేకూర్చారు రష్యా విదేశాంగ మంత్రి. కానీ గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా కు వెళ్లి పర్యటించగలవా.. అంత సాహాసం చేయవు. పుతిన్ ఒక రకంగా గెలిచాడనే చెప్పొచ్చు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అక్కడక్కడ ప్రతి ఘటన ఎదురవుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు నిస్సహాయ స్థితిలో కి చేరిపోయారు. ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు ఆయుధాలు ఇస్తామని చెబుతున్నా నాటో దేశాలు సరైన సమయానికి ఇవ్వడం లేదు. ఒక్కో ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసేసుకుంటుంది. ఆయుధాల తయారీ, వాటిని ఉక్రెయిన్ కు అందించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఈ లోపే రష్యా భీకరమైన దాడులతో తెగబడుతోంది. ఉక్రెయిన్ కు ఆయుధాలు చేరాలంటే సొరంగ మార్గం ద్వారానే రావాలి. ఆకాశ మార్గంలో వస్తే రష్యా దాడులకు తెగబడే  అవకాశం ఉంది. ఎటు చూసిన ఉక్రెయిన్ కు దారులు మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. యుద్దం మొదలై ఏడాది దాటిపోయిన తర్వాత రష్యా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్ లోని మరియపోల్ పట్టణంలో పర్యటించడం గెలిచిన కింద లెక్క అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: