రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: ఆ మిస్టరీ వీడిందా?

రష్యా కు సంబంధించి, ఇంకా చైనాకు సంబంధించిన ఒక లింకు గత కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతూ వస్తుంది. చైనాకు సంబంధించిన సంస్థలు అమెరికాలోనూ, ఇంకా యూరప్ దేశాలలోనూ కొన్ని  సంస్థలకు  ఆయుధాలకు సంబంధించిన విడిభాగాలు  అమ్ముతున్నాయి లేదా మిస్సైల్స్ లేదా ఇతర బాంబులను పేల్చడానికి యుద్ధంలో పనికి వచ్చే ఆయుధాలను తయారు చేసే సంస్థలకు రా మెటీరియల్స్ ని అమ్ముతున్నాయి అనే విషయం.

ఆ రా మెటీరియల్స్ ను తీసుకున్న సంస్ధలు మళ్ళీ తీసుకెళ్లి రష్యాకిస్తున్నాయట. ఎందుకంటే రష్యా వాడు ఇతర దేశాల్లో పెట్టినటువంటి సంస్థలవి. అలా మొదట్లో రా మెటీరియల్స్ ఇచ్చినట్టు చూపించినా, నిజంగా అయితే ఒక యుద్ధ విమానాన్ని  ముక్కలుగా విడదీసి, ఒక అర డజను కంపెనీలకు చెరొక ముక్క ఇచ్చి అక్కడకు వెళ్లాక వాటి అన్నింటినీ కలిపి తయారు చేయడానికి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల ద్వారా, ఇంజనీర్ల ద్వారా ప్లాన్ చేస్తున్నారన్న విషయం బయటకు రావడంతో, ఆ విషయం పైన అమెరికా చైనాను నిలదీయడం, యూరప్ దేశాలు విమర్శించడం ఇవన్నీ జరిగిపోయాయి.

చైనా కూడా స్వయంగా దీన్ని ఇప్పుడు తోసి పుచ్చింది. తాజాగా తోడు దొంగ అయిన రష్యా కూడా అట్లాంటిది ఏమీ లేదు అని ఈ విషయాన్ని తోసిపుచ్చుతుంది. ఒక అదృశ్య శక్తి ఉక్రెయిన్ యుద్ధంలో పనిచేస్తుందంటూ అమెరికా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఆ అదృశ్య శక్తి చైనా అనే అమెరికా పరోక్షంగా చెప్పుకుంటూ వస్తుంది. అంటే పరోక్షంగా రష్యాకి చైనా ఆయుధాలను ఇస్తూ వస్తుంది అని ప్రపంచానికి తెలియచెప్పే విధానం అది.

అమెరికా కుట్రను, అది చేసే రాజకీయ ఎత్తుగడలను గతంలోనే ఎన్నో చూసిన రష్యా, అమెరికా మాటను ఎలా తోసి పుచ్చిందంటే, ఉక్రెయిన్ యుద్ధంలో పనిచేస్తుంది అదృశ్య శక్తి కాదు, అది బహిరంగ శక్తే అదే ఉక్రెయిన్ కి ఆయుధాలను రహస్యంగా సరఫరా చేస్తుంది, ఇదంతా చేస్తుంది అమెరికానే అంటూ ఎదురు దాడి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: