పుతిన్‌ రహస్య జీవితాన్ని బయటపెట్టిన మీడియా?

అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ధీటుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు క్యారెక్టర్ గురించి చెడు ప్రచారం చేయడంలో ముందుంటాయి. కానీ సమాజంలో ఎదైనా సమస్యపై ప్రజలకు వివరంగా చెప్పాలనుకున్న సమయంలో ఆ వాదన కు ప్రజల ఆమోదం లభించకపోతే తర్వాత దానికి పర్యవసానం క్యారెక్టర్ ను కించపరచడం చేస్తుంటారు.

ఇందులో అమెరికా, యూరప్ దేశాలు ముందు వరసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యవస్థను దెబ్బతీయాలేనపుడు మన నేషనల్ మీడియాలో.. టీడీపీ అనుకూల మీడియాలో అప్పుడప్పుడూ వ్యక్తుల చరిస్మా దెబ్బతినేలా వార్తలు రాస్తుంటాయి. కానీ ఎంత ప్రయత్నం చేసినా దెబ్బకొట్టలేరు. రష్యా విషయంలో అమెరికా, యూరప్ దేశాలు పుతిన్ పై విష ప్రచారం కొనసాగిస్తున్నాయి. పుతిన్ కు క్యాన్సర్ ఉంది. రెండు వారాల్లో చనిపోతాడని ప్రచారం చేశాయి.

రష్యా పై అన్ని దేశాలు కలిసి పోరాటం చేసినా ఇంకా గెలవలేకపోయాయి. ఏడాది అయిపోతుంది. ఉక్రెయిన్ మాత్రం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో పుతిన్ భార్యపై నిందలు వేయడానికి సిద్ధమయ్యారు. విలాసవంతమైన స్వర్గం లాంటి భవనాన్ని పుతిన్ నిర్మించుకున్నారు. అందులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.  పుతిన్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స తీసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్ కు పెట్టింది పేరు పుతిన్ అని తాజాగా ఆయన ప్రేయసి అలీనా కబీయాతో కలిసి 990 కోట్ల విలువైన విలావసంతమైన ఎస్టేట్ లో నివసిస్తున్నట్లు ఇంగ్లీష్ పత్రికలు పేర్కొన్నాయి. వారి ముగ్గురు పిల్లలతో మాస్కోకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో రహస్య ప్రాంతంలో ఈ అధ్యక్షుడి భవనం ఉన్నట్లు పేర్కొన్నాయి.

పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉందని తెలిపాయి. ఎస్టేట్ వాల్దాయి సరస్సు ఒడ్డున ఉన్నట్లు తెలిపాయి. అలీనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడిలిస్ట్. ఈమె యూనైటెడ్ రష్యా పార్టీలో సభ్యత్వం ఉందని ఆమె 6 సంవత్సరాల పాటు ఎంపీ గా కూడా చేశారని ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: