కొత్త రకం ఆయుధాలతో రెచ్చిపోతున్న రష్యా?

యుద్ధ విమానాలకు సంబంధించి సుఖోయ్‌లు, రాఫెల్స్, ఎఫ్-16 ఇలాంటివన్నీ అయిపోయాయి. ఇట్లా రకరకాల యుద్ధ విమానాల గురించి సూపర్ సోనిక్ విమానాల గురించి ఇప్పటివరకు విన్నాం. ఇక ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అవతలి వాళ్ళతో యుద్ధం చేయాలంటే డ్రోన్లు కావాలి   అని నిర్ధారణకు వచ్చేశాయి చాలా దేశాలు. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగ్పుత్ లో రష్యా వాడుతున్న డ్రోన్ల పేరు బూమెరాంగ్ డ్రోన్ అట.

రకరకాల సైజుల్లో ఉన్న ఈ డ్రోన్లు విజువల్ షూట్ చేసి మెయిన్ కంట్రోల్ రూమ్ కి పంపిస్తాయి. దాంట్లో ఉన్న తుపాకులతో, బాంబులతో ఎక్కడ పేల్చమంటే అక్కడ బాంబింగ్ చేసేస్తాయి. లేకపోతే తనను తాను కాల్చుకుంటూ  మిగతా వాళ్ళను కూడా పేల్చేసేటువంటివి ఇవి. అట్లాంటి నాలుగు డ్రోన్లను మాత్రమే పేల్చగలిగింది ఉక్రెయిన్. ఆ సందర్భంలో రష్యా, ఇరాన్ ఇచ్చినటువంటి కామికాజీ డ్రోన్లనే పేరు మార్చి వాడిందని చెప్తున్నారు.

ఇంకో పక్క ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్ కూడా రష్యా లోపలికి వెళ్ళి మరీ డ్రోన్ల ద్వారా అటాక్ చేసింది, వీళ్ళు సూసైడ్ డ్రోన్లను వాడారు అని చెప్తున్నారు. దీనిలో విఆర్ గ్లాస్సెస్ డ్రోన్స్ ను వాడారు అని చెప్తున్నారు. దాంట్లో ఒక ప్లేస్ ని ఫిక్స్ చేస్తే 170కిలోమీటర్ల వేగంతో మూడు గంటల బ్యాటరీతో పని చేస్తూ రష్యా అంతర్భాగంలోకి వెళ్లి అక్కడ ప్రాంతాన్ని అంతా రాడార్లకు అందకుండా బేస్ కి సమాచారం అందించి ఆ తర్వాత అక్కడ పేలిపోయేటటువంటి డ్రోన్లను వాడారు అన్నటువంటి విషయం బయటపడింది.

షాహిద్136 డ్రోన్లు అని పిలవబడే సూసైడ్ డ్రోన్లు 2,200కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సర్వనాశనం చేయగలిగినవి. వాటిలో 5నుండి 30కిలోల వరకు బాంబులు పంపించవచ్చు. ఇంకొకటి వోక్లాన్10 అనబడే చిన్నపాటి డ్రోన్లు. ఇవి కొన్ని బాంబులను తీసుకెళ్లగలవు. కానీ వీటి‌
కెపాసిటీ 40నిమిషాలు మాత్రమే. ఇట్లాంటి డ్రోన్లను ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద వాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: