10 గ్రాముల బంగారం ఏకంగా రూ.2 లక్షలు ?

ఒకవేళ బంగారం విలువ పడిపోతే ఏం జరుగుతుంది. మహిళలు ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న ప్రజలకు బంగారం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. నగలు చేయించుకుంటారు. ఇంకా బంగారాన్ని దాచి పెట్టుకుంటారు. బంగారం రేటు పెరగాలనే అందరూ కోరుకుంటారు. బంగారాన్ని ఇష్టపడని వారు ఉండరు. ఎప్పటికైనా బంగారం ధర పెరుగుతుంది కానీ తగ్గదు అంటుంటారు. బంగారం ధరల్లో అప్పుడప్పుడు హెచ్చు తగ్గులు కూడా వస్తుంటాయి.

ప్రస్తుతం పాకిస్థాన్ లో పది గ్రాముల బంగారం విలువ రూ. 2.05లక్షల నుంచి 2, 10 లక్షలకు చేరింది. అలాగే పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. లీటర్ డీజిల్ రూ.284 గా పలుకుతోంది. ఇంతటి ఘోరమైన ధరల పెరుగుదల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న మాట నిజం. భారత్ లో నోట్ల రద్దు అనే అంశం కూడా ఒక కారణం.. ఎందుకంటే భారత్ లో నోట్ల రద్దు అనే అంశం వల్ల పాక్ లో తయారయ్యే నకిలీ నోట్లు, ఉగ్రవాదులకు చేరలేదు. దాడులు తగ్గిపోయాయి. దేశంలో ఉగ్ర దాడులు ఆగిపోయాయి. కానీ దీన్ని ఇండియాలోనే ఉన్న కొంత మంది ఒప్పుకోరు.
 
గతంలో పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులు భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్థాన్ స్వతంత్రంగా ఎంతో ఎదిగింది. భారత్ లో ఉన్నప్పుడే ఏం సాధించలేకపోయాం అనే వారు. ఇప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా కుదేలైంది. అప్పులు పెరిగిపోయాయి. గోధుమపిండి కూడా దొరకని వైనం. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. తాలిబాన్లతో సరిహద్దు వివాదంలో గొడవలు.  ఇలా అనేక కారణాలతో పాకిస్థాన్ పతనం అవుతోంది. కానీ భారత్ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక పరంగా బలంగా ఉంటోంది. దీనికి కారణం ఇక్కడ తీసు కుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: