చంద్రబాబును భయపెడుతున్న జగన్ బ్రాండ్‌?

ఏదేమైనా మొన్నటి విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ మీట్‌ ద్వారా ఏపీ ప్రతిష్ట పెరిగింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా ఒకే వేదికపై వచ్చి ఏపీలో పెట్టుబడులు పెడతామని ప్రకటించడంతో సీఎం జగన్ ప్రతిష్ట పెరిగింది. జగన్ పరిశ్రమలను తరిమేస్తున్నాడంటూ కొంత కాలంగా ఏపీలో చంద్రబాబు టీమ్ చేస్తున్న ప్రచారానికి ఈ సదస్సుతో చెక్‌ చెప్పినట్టు అయ్యింది.

అయితే.. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు విజయవంతం అయ్యిందని..., పర్యాటక రంగంలో చాలా పెట్టుబడులు వచ్చాయని మంత్రి రోజా చెబుతున్నారు.  ఈ సదస్సు ద్వారా జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థమైందని మంత్రి రోజా అన్నారు. గతంలో పెట్టుబడుల సదస్సుల్లో జరిగిన ఎంఓయూలు కాగితాలకే పరిమితం అయ్యేవని మంత్రి రోజా విమర్శించారు. పెట్టుబడుల సదస్సు జరిగిన తీరు, వచ్చిన పెద్ద పారిశ్రామిక వేత్తలను చూసి ప్రతిపక్షాలకు నోరెత్తలేని పరిస్థితి వచ్చిందని మంత్రి రోజా అన్నారు.

అంబానీ, అదానీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు. కోవిడ్ లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదని మంత్రి రోజా అన్నారు. పర్యాటక శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేశామని మంత్రి రోజా తెలిపారు. కాకినాడలో డెస్టినేషన్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి రోజా వెల్లడించారు. దేవభూమి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో రోప్ ప్రాజెక్టులు రానున్నట్లు మంత్రి రోజా తెలిపారు.

వైజాగులో సఫారీ ప్రాజెక్టు రాబోతోందని మంత్రి రోజా తెలిపారు. అయితే.. రోజా టూరిస్టా..? టూరిజం శాఖ మంత్రా అని విమర్శలు చేసే వారికి ఇదే సమాధానమని మంత్రి రోజా బదులిచ్చారు. లోకేష్‌ పెట్టుబడుల సదస్సును ఫేక్ సదస్సు అన్నాడని...., చంద్రబాబు ఈ స్థాయిలో ఏనాడైనా పారిశ్రామిక వేత్తలను ఒకే స్టేజ్ మీదకు తెచ్చారా అని మంత్రి రోజా ప్రశ్నించారు.

 పెట్టుబడుల సదస్సుకు విమర్శలు చేసే వారు వచ్చుంటే సెల్ఫీ తీయించి పంపేవాళ్లమని మంత్రి రోజా ఘాటుగా సమాధానం చెప్పారు. పెట్టుబడుల సదస్సుతో జగన్ ఇమేజ్ పెరిగిందని మంత్రి రోజా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: