ఆ రెండు దేశాలపై అమెరికా కుట్ర..?

ప్రపంచ దేశాల్లో ఉన్న విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి పని చేస్తేనే అమెరికా అగ్రరాజ్యంగా మారింది. అంతే కానీ ఒంటరిగా మేం అన్ని సాధించేశాం అని అనుకుంటే అమెరికా పప్పులో కాలేసినట్లే.. అయితే అమెరికా ఒంటెద్దు పోకడలు ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ దేశాలపై ఆంక్షలు పెడుతోంది.

రష్యా తన చెప్పుచేతల్లో ఉండాలని వారిపై పరోక్షంగా యుద్ధం చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతుండగా ఉక్రెయిన్ కు ఆయుధాలను అందిస్తోంది. రష్యాను ఏకాకిగా చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ పుతిన్ ఏ మాత్రం తగ్గకుండా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు.

ఇదే సమయంలో చైనా రష్యాకు సాయం చేస్తూ ఆయుధాలను అందిస్తోంది. దీన్ని చూసి ఓర్వలేని అమెరికా చైనాపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. రష్యా కు ఎందుకు ఆయుధాలు ఇస్తున్నారని చైనాపై మండిపడింది. దీనికి బదులుగా చైనా మాట్లాడుతూ.. మీరెందుకు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తున్నారు. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా, అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీరెవరూ మమ్మల్ని ఆయుధాలు ఇవ్వద్దు అనడానికి అంటూ అమెరికాకు చురకలు అంటించింది.

ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉన్న అమెరికా చాలా దేశాలపై ఆంక్షలను పెడుతూ.. అహంకార ధోరణి ప్రదర్శిస్తోంది. ఇరాన్, ఆఫ్గానిస్తాన్, లిబియా, ఇరాక్ లాంటి దేశాలపై గతంలో దాడులు కూడా చేసింది. ఆ దేశం వివిధ దేశాలపై విధిస్తున్న ఆంక్షలపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ఈ సమయంలో కూడా మేం చెప్పిందే వినాలని పట్టుబడుతున్న అమెరికాను చూసి చాలా దేశాలు సూటిగానే ప్రశ్నిస్తున్నాయి. అమెరికా ఇంతలా అభివృద్ధి పథంలో దూసుకుపోయిందంటే కారణం ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది ఆ దేశం కోసం పనిచేయడమే దాన్ని విస్మరించి అందరిపై పెత్తనం చెలాయిస్తానంటే ప్రస్తుత రోజుల్లో ఎవరూ చూస్తూ ఉండే అవకాశం లేదు. కాబట్టి అగ్రరాజ్యం పెడధోరణి మారాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: