అరెస్టు తప్పదని డిసైడైన కవిత.. ఇంటర్వ్యూలు అందుకేనా?

రాజకీయ నాయకులు మేము అరెస్టు కాబోతున్నాం అనే  ముందస్తు ప్రకటనలు ఇస్తుంటారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా నన్ను అరెస్టు చేయబోతున్నారు అని ముందుగానే ప్రకటించారు. అనుకున్న విధంగానే జగన్ ని సీబీఐ అరెస్టు చేసింది. ఆయన జైలు జీవితం గడిపారు. వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా, ఎమ్మెల్యే గా గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కు సీఎంగా కొనసాగుతున్నారు.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ సిసోడియాను అరెస్టు చేసింది. దీనికి ముందే ఆయన మీడియా ఎదుట నేను అరెస్టు కాబోవచ్చంటూ చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కనిమెళి ఎంపీగా, రాజా కేంద్ర మంత్రులుగా పని చేశారు. వీరు కూడా 2జీ స్కాం లో అరెస్టు అయ్యారు. అంటే ఇలా ముందుగానే అరెస్టు కాబోతున్నాం అని వీరికి తెలిసిపోతుందేమో.. ప్రకటలను ఇచ్చేస్తుంటారు.

ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఆమె ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అరెస్టు చేస్తే చేయనీయండి అని వ్యాఖ్యనించారు. లిక్కర్ స్కాం లో సీబీఐ ఆమె పేరును చేర్చడం, ఒకసారి ఆమెను దర్యాప్తు పేరిట సీబీఐ విచారించడం కూడా జరిగింది. మరి కొద్ది రోజుల్లో కవిత అరెస్టు అవుతుందో లేదో చూడాలి.

ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూల్లో చట్టసభల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. నిజమే రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ తెలంగాణలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కేటాయించింది. ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారనేది ఆమె ముందుగా అవలోకనం చేసుకుంటే మంచిది. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం లేదు. కానీ మహిళా రిజర్వేషన్ కోసం తాను పోరాటం చేస్తానని టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ కాలం గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: