సైంటిస్టులపై విషప్రయోగం.. అమెరికా సీక్రెట్‌ ఔట్‌?

క్యూబాలో దౌత్య వేత్తల సమావేశం జరిగిన సమయంలో అమెరికా దౌత్యవేత్తలపై హవానా సిండ్రోమ్ అనే వైరస్ ను ప్రయోగించారని అమెరికా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో దౌత్యవేత్తలు తలనొప్పి, కడుపు మంట, తీవ్రమైన మానసిక క్షోభ కు గురయ్యారని అమెరికా తీవ్రంగా ఆరోపించింది. అయితే దీనిపై దర్యాప్తు చేయాలని అమెరికా పట్టుబట్టింది.

అక్కడ విదేశీ కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. అమెరికాలోని ఇంటిలిజెన్స్ నివేదిక బయట పెట్టిన విషయం ఏమిటంటే.. 2016 లో క్యూబా రాజధాని హవానలో ఉన్న యూఎస్ దౌత్య కార్యాలయంలో అనారోగ్యం పాలయ్యారని తెలిసింది. కొంతమంది మెమొరీ లాస్ అయ్యారు. కొంతమంది వింతగా ప్రవర్తించారు. ఇదే తరహాలో రష్యా, పోలండ్, సెర్బియా, కొలంబియా, ప్రాన్స్, వియత్నాం దౌత్య వేత్తలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.

2021 లో వియత్నాం వ్యవహారంపై విచారణ ప్రారంభించి, ఆ తర్వాత సింగపూర్ కు వెళ్లిన సమయంలో ఇలానే జరిగిందని అమెరికా దౌత్య వేత్తలు ఆరోపించారు. అయితే దౌత్య పరమైన ఒత్తిడి వల్లే ఆ విధంగా జరిగిందని అందులో ఎలాంటి కెమికల్ ఎటాక్ అనేది లేదని చెప్పారు. రక్త పరీక్షలు చేసి తేల్చిన విషయం అందులో ఎలాంటి ఎటాక్ జరగలేదని అమెరికా బయటపెట్టింది.

కేవలం వారు ఎదుర్కొంటున్న దౌత్య పరమైన ఒత్తిడుల వల్లే వారు ఆ విధంగా ప్రవర్తించారని వారిపై ఎలాంటి దాడి జరగలేదని అమెరికా చేసిన దర్యాప్తులో వెల్లడైంది. కానీ క్యూబా తప్పు చేసినట్లుగా ఇన్ని రోజులు వారిని అమెరికా ఆడిపోసుకుంది. కానీ తప్పు లేదని తెలిసిన తర్వాత కూడా క్యూబాకు కనీసం సంఘీభావం కూడా తెలపడం లేదు. తప్పు చేయలేదని క్యూబా నెత్తి నోరు కొట్టుకున్న వినకుండా ఇన్ని రోజులు ప్రపంచ వ్యాప్తంగా క్యూబాను అమెరికా ఏకాకిని చేయాలని ప్రయత్నించింది. కానీ నిజం తెలిశాక కూడా సరిగా ప్రవర్తించకపోవడం అమెరికాకే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: