ఆ దేశాల్లో జనం తిరగబడుతున్నారా?

ప్రస్తుతం నాటో దేశాల పరిస్థితి శృతి మించి రాగాన పడినట్టుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వీళ్ళకి పొరపాటున కూడా ఏ సంబంధం లేదు. రష్యా లో భాగమైన ఉక్రెయిన్ గతంలో యూ.ఎస్.ఎస్.ఆర్ నుంచి విడిపోయింది. అంతవరకు బానే ఉంది. వాళ్ళిద్దరికీ ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళిద్దరూ చూసుకుంటారు. బై లేటరెల్ డిస్కషన్స్ జరగాలి వాళ్ళిద్దరి మధ్యన. కానీ మధ్యలో దూరిపోయింది అమెరికా, దూరిపోయి ఉక్రెయిన్ ను రెచ్చగొట్టింది.

ఆ వెనకాల నాటో దేశాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ ఉంది. వాటిలో నీకు మెంబర్షిప్ ఇస్తాను. కుర్చీ కూడా సిద్ధంగానే ఉంది అంటూ ఆఫర్ ఇచ్చారు. అయితే దానికి మేమేం చేయాలని ఉక్రెయిన్ అడిగితే రష్యా సంగతి చూడు అని రెచ్చగొట్టారు. తమ దేశంలో నాటో దళాలను మోహరించడానికి పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకువచ్చారు.

అయితే పుతిన్ మాత్రం ఇదంతా కరెక్ట్ కాదు, మనిద్దరి మధ్య యూరోపియన్ యూనియన్ గాని, నాటో దేశాలు గాని ఉండకూడదని అనుకున్నాం కదా. అలా మాట తప్పినందుకే  ఉక్రెయిన్ మా నుండి వేరై పోవాల్సి వచ్చింది అంటున్నాడు . దాంతో క్రిమియాను ఆక్రమించుకున్నాడు పుతిన్. ఆ తర్వాత మరో నాలుగు ప్రాంతాలను కూడా ఆక్రమించుకున్నాడు.

వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వెనక నుండి లాభపడాలనుకునే వాళ్ళకి చెక్ చెబుతూ సాగింది పుతిన్ వ్యవహారం. దాంట్లో మేమందరం ఉన్నాం, మాదే విజయం అని చెప్పుకుంటూ నాటో దేశాలన్నీ కూడా ఆయుధాలను ఇస్తూ వస్తున్నాయి. వీళ్ళకి రష్యా నుండి చీప్ గా వచ్చే పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగ్గిపోయాయి. ధరలు పెరిగిపోయాయి. ఒకవైపు ఉద్యోగాలు పోయి, ఉపాధి అవకాశాలు కోల్పోయి,  ధరలు కూడా పెరిగిపోవడంతో  ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. దాంతో బ్రిటన్ ఇంకా అమెరికా లాంటి చోట్ల కూడా దాతృత్వం వల్ల వచ్చిన ఆహారం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో నాటో దేశాల్లో ప్రజా ఉద్యమాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: