ఆ ఒక్క హామీతో యూత్‌ను ఆకట్టుకుంటున్న లోకేష్?

సంక్షేమ పథకాలలో ప్రత్యామ్నాయం ఏంటి అనే దానిపై టీడీపీ నేత లోకేష్ ప్రజల నుంచి వివరాలు రాబట్టేందుకు హలో లోకేష్ అనే కార్యక్రమం చేపట్టారు. జాబ్ క్యాలెండర్ లో జగన్ పెయిల్యూర్ విధానం గురించి వివరిస్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని తీసుకొస్తామని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం ఉద్యోగ ప్రకటనలు ఉంటాయని చెప్పారు. కానీ దానికనుగుణంగా ఏమీ లేవు. టీడీపీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పింది. వీరు దాన్ని మరిచిపోయారు. మళ్లీ లోకేష్ ఈ పథకం గురించి మాట్లాడుతున్నారు. ఈ దఫా మమ్మల్ని ప్రజలు నమ్మాలని కోరుతున్నారు.

గతంలో ఫీజు రీయంబర్స్ మెంట్ కళాశాలకు వస్తుండేవి. కానీ విద్యా దీవెన అనే కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను పంపిస్తున్నారు. లోకేష్ మాత్రం ఈ పథకాన్ని రద్దు చేసి నేరుగా కళాశాలలకే డబ్బులను చెల్లిస్తాం అంటున్నారు. మధ్య తరగతి తల్లులు కొంతమంది చెల్లిస్తున్నారు. కానీ కొందరు ఒకటి రెండు సార్లు చెల్లించి తర్వాత ఖర్చపోయాయని చెబుతున్నారు.

డబ్బులు తీసుకుంటున్న తల్లిదండ్రులు వాటిని కట్టేందుకు వెళ్లినపుడు విద్యార్థి చదువు బాగోగులు గురించి అడుగుతారు. కానీ కొన్ని సార్లు ఆ డబ్బులను ఖర్చు చేయడం వల్ల కాలేజీల యాజమాన్యాలు పై చదువులకు అంగీకరించడం లేదు. ఇలా పై చదువులకు ఇబ్బంది పడకుండా గతంలో ఇచ్చిన విధంగానే ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. నేరుగా కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే మనీ వెళ్లిపోతుంది. ఏ విద్యార్థికి ఎంత ఇవ్వాలి, తదితర వివరాలను ప్రభుత్వం చూసుకుంటుంది. పథకం ఒకటే కానీ డబ్బులు ఇచ్చే విధానమే వేరు. మరి లోకేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రజలకు నచ్చుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: