అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ప్రేమిస్తే పెళ్లి చేసుకుని స్థిరపడాలి. లేదంటే ప్రేమించడం మానేయాలి. కానీ ప్రేమించి సహజీవనం చేసిన తర్వాత పెద్దలు ఓప్పుకోవడం లేదు. కులం అడ్డొస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేదంటూ అబ్బాయిలను కొంత మంది అమ్మాయిలు రిజక్ట్ చేస్తున్నారు. దీని వల్ల కొంతమంది సైకోలుగా మారి అమ్మాయిలను వెంటాడి వేధించి అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల బెంగుళూరులో ఒకటి జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా జగన్నాథపురానికి చెందిన లీల పవిత్ర ప్రస్తుతం బెంగుళూరులో జర్నలిస్టుగా పనిచేస్తుంది. గతంలో కాకినాడలో న్యూస్ రీడర్ గా పని చేసింది. బెంగుళూరులో ఉద్యోగం రావడంతో జనవరిలో అక్కడకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటుంది. ఈమె తల్లి రాధాకృష్ణవేణి గృహిణి కాగా, తండ్రి అబ్బులు హెచరీ వ్యాపారంలో ఉన్నారు. వీరికి ఎకైక కుమార్తె లీల.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లి వరసకు చెందిన బానాల దివాకర్ విశాఖలో ఎంఎస్సీ చదువుతుండగా లీలకు దివాకర్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం దివాకర్ కూడా బెంగుళూరులో లీల పనిచేసే కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆఫీసుకు దగ్గరలోనే ఫేయింగ్ గెస్ట్ లుగా ఉంటున్నారు. దివాకర్ వేరే కులానికి చెందిన వాడు కావడంతో లీల తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. తల్లిదండ్రుల మాట మీరి నీతో పెళ్లి చేసుకోలేనని దివాకర్ కు లీల చెప్పడంతో పాటు అతని ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేసింది.

ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న దివాకర్ లీలను బెంగుళూరులోని ఓమెగా హస్పిటల్ ఎదురుగా నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపాడు. వీళ్లు పెరిగిన  విధానం తప్పు అనుకోవాలా.. ఇన్ని రోజులు సహజీవనం చేసినా పెళ్లి వద్దని చెప్పినా పెద్దలది తప్పు అనాలా.. ఏదేమైనా ఒక నిండు ప్రాణం పోయింది. మరో కుటుంబం జైలు పాలై దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: