ఉక్రెయిన్‌ యుద్ధం: భారత్‌కు భారీ లాభం?

పెట్రోల్, డిజీల్, గ్యాస్ ను రష్యా నుంచి ఎక్కువగా కొంటున్నప్పటికీ ధరలు తగ్గాల్సింది పోయి గ్యాస్ ధరలు పెరగడంపై కేంద్రంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఖర్చు తగ్గినపుడు గ్యాస్ ధరలు తగ్గాల్సింది పోయి పెరగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఆర్థికంగా బలంగా తయారవుతుంది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆయా దేశాలు పూర్తిగా మానేశాయి.

అయితే సౌదీ అరేబియా, యూఎస్ ఏ నుంచి కొనుగోలు చేసే ఆయిల్ కంటే రష్యా నుంచి తీసుకోవడం అది తక్కువ ధరకు రావడంతో ఆదాయం ఆ మేరకు పెరిగింది. ఇండియా రష్యా నుంచి కొన్న తర్వాత దేశానికి ఎంత ఆదాయం వచ్చిందంటే దాదాపు 3.6 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.

ఇది కేవలం ఏడాదిలోగా వచ్చిన ఆదాయమే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ తన అవసరాలు తీర్చుకోవాలంటే తక్కువ ధరకు వచ్చే చోట్ల తప్పక కొనాల్సిందే. ఈ విధంగా కొనడం ద్వారా భారత్ చాాలానే ఆదాయం వచ్చింది. కాబట్టి ఆ దేశాలతో మనకేం సంబంధం లేకుండా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చిన భారత్ వెనకడుగు వేయకుండా ఆయిల్ ను కొనుక్కుంటుంది.

అంతే కాదు కొన్న ఆయిల్ ను ఎక్కువ ధరలకు విదేశాలకు కూడా సరఫరా చేయడం మొదలు పెట్టింది. ఎలాగో తక్కువ ధరకు వస్తుంది. మన అవసరాలు పోను మిగిలిన దాన్ని ఇతర దేశాలకు అందిస్తోంది. దీని వల్ల మరింత లాభం చేకూరుతుంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ఆ రెండు దేశాలే కాదు.. యూరప్ దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఇలా కాకుండా తటస్థంగా ఉంటూ దేశ అభివృద్ధి కుంటుపడకుండా చూడటంలో భారత్ సఫలమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: